తమల పాకులను కేవలం శుభకార్యాలకే వాడతారు అనుకుంటే పొరపాటే. వీటితో అనేక అనారోగ్య సమస్యలకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. పలు దీర్ఘ కాలిక వ్యాధులు కూడా తమల పాకుతో పోతాయి. తమల పాకులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక మనిషి ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి తమల పాకులు. ఇందులో థయామిన్, బీటా రెరోటిన్, కాల్షియం, కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, కాపర్, నియాసిన్, విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, రైబో ఫ్లావిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో తమల పాకు పాత్ర ముఖ్యమైనది. వివిధ రోగాలకు తమల పాకును విరివిగా ఉపయోగిస్తారు. తమలపాకుతో ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ శక్తిని పెంచుతుంది:
తమలపాకులు జీర్ణ శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఫైబర్ అరుగుదల శక్తిని మెరుగు పరుస్తుంది. తమల పాకు రసం తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే చిన్న పిల్లలకు కూడా ఈ రసాన్ని ఇవ్వవచ్చు. దీంతో మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
నోటి దుర్వాసన ఉండదు:
నోటి దుర్వాసన పోగొట్టడంలో తమలపాకు అద్భుతంగా పని చేస్తుంది. ఓ ఐదు తమల పాకులను నీటిలో ఓ ఐదు నిమిషాలు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని దించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో తేనె కలుపుకుని తాగితే నోటి నుంచి వచ్చే దర్వాసన తగ్గుతుంది.
దంతాలకు బలాన్ని ఇస్తుంది:
తమలపాకులో ఉండే కాల్షియం, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతాలకు బలాన్ని ఇస్తుంది. అలాగే చిగుళ్లను కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
చర్మ సమస్యలు ఉండవు:
చర్మ సమస్యలకు చక్కగా పని చేస్తుంది తమలపాకు. పసుపుతో కలిపిన తమలపాకు మిశ్రమాన్ని స్కిన్ పై రాస్తే ఫలితం కనబడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది:
తమల పాకులో ఉండే యాంటీ హైపర్ గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలోని షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచేందుకు సహాయ పడుతుంది.
ఆందోళనను తగ్గిస్తుంది:
తమలపాకుతో ఒత్తిడి, ఆందోళన కూడా కంట్రోల్ లోకి వస్తాయి. తమలపాకులో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు.. బాడీ నుంచి కాటెకోలమైన్ లు అనే ఆర్గానిక్ సమ్మేళనాలను రిలీజ్ చేస్తుంది. దీంతో ఆందోళన తగ్గుతుంది.
శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది:
తమలపాకులోని ఉండే ఔషధ గుణాలు శ్వాస కోశ వ్యాధులకు చెక్ పెడుతుంది. బ్రాంకైటిస్, ఉబ్బసం, దగ్గు వంటి అనారోగ్య సమస్యల చికిత్సలో తమల పాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి