Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భ‌య‌పెడుతున్న సమ్మర్.. 2.5 రెట్లు పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు.. వామ్మో ఇలాంటి లక్షణాలుంటే జర జాగ్రత్త..

మే వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.. ఓ వైపు ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజ‌న్‌లో కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ త‌న నివేదిక‌లో తెలిపింది.

భ‌య‌పెడుతున్న సమ్మర్.. 2.5 రెట్లు పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు.. వామ్మో ఇలాంటి లక్షణాలుంటే జర జాగ్రత్త..
Kidney Stones Diet Tips
Yellender Reddy Ramasagram
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 01, 2025 | 3:07 PM

Share

మే వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.. ఓ వైపు ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజ‌న్‌లో కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ త‌న నివేదిక‌లో తెలిపింది. డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు స‌రిగా లేక‌పోవ‌డం, విప‌రీతంగా ఎండ‌ల్లో తిర‌గ‌డం వ‌ల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల స‌మ‌స్యతో రావ‌డంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్స చేస్తున్నారని వైద్యులు తెలిపారు.

వాస్తవానికి వైద్యులు.. వేస‌విని “స్టోన్ సీజ‌న్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీల‌కు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా.. శ‌రీరంలో నీరు ఆవిరి అయిపోవ‌డం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం, త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వేస‌విలో కిడ్నీల‌లో రాళ్లు ఎక్కువ‌గా ఏర్పడ‌తాయి.

ఏఐఎన్‌యూకు రోజుకు స‌గ‌టున 300 నుండి 400 కిడ్నీలో రాళ్ల కేసులు వ‌స్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇది బాగా ఎక్కువ‌. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. దీనికి కారణం జంక్ ఫుడ్ తిన‌డం, ఎక్కువ‌గా క‌ద‌ల‌క‌పోవ‌డం, త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం.. ఈ సమస్య పిల్లలు, యువ‌త‌లో ఎక్కువ‌వుతోంది. 10-17 సంవ‌త్సరాల మ‌ధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాఠ‌శాల‌లో ఉన్నప్పుడు నీళ్లు తాగ‌క‌పోవ‌డం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తిన‌డం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కార‌ణమని వైద్యులు తెలిపారు.

పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల‌కు ఈ స‌మ‌స్య కొంత త‌క్కువే కానీ, గ‌ర్బవ‌తులుగా ఉన్నప్పుడు ఈ స‌మ‌స్య వ‌చ్చి, గుర్తించ‌క‌పోతే ముప్పు ఎక్కువ‌ అని అంటున్నారు. పిల్లల్లో ఈ స‌మ‌స్య వ‌ల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం ప‌డుతుంది. ఈ సంద‌ర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియ‌ర్ క‌న్సల్టెంట్ మాట్లాడుతూ.. కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధార‌ణంగా పెరిగాయన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువ‌త‌లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వేడి పెరిగిపోవ‌డం, త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం ఇందుకు ప్రధాన కార‌ణాలన్నారు. పాఠ‌శాల‌కు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య ఎక్కువ అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ రాళ్ల స‌మ‌స్య కేవ‌లం పెద్దవాళ్లది అనుకోకూడ‌దు. పిల్లల త‌ల్లిదండ్రుల‌తో పాటు పాఠ‌శాల‌లు కూడా దీనిపై అవ‌గాహ‌నను పెంపొందించాలి.. త‌గినంత నీళ్లు తాగ‌డం, స‌రైన ఆహారం తీసుకోవ‌డం, స‌మ‌స్యను త్వర‌గా గుర్తించ‌డం వ‌ల్ల తీవ్ర ప్రమాదం నుంచి బయటపడొచ్చు.. ముఖ్యంగా.. వేస‌విలో ఈ జాగ్రత్తలు త‌ప్పక తీసుకోవాలి అని సూచించారు.

త‌గిన‌న్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేత‌రంగులో ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు ప‌దార్థాల వాడ‌కం త‌గ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడ‌కం మానేయాలి. కుటుంబంలో ఎవ‌రికైనా గ‌తంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడితే మ‌రింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిక‌ప్పుడు కిడ్నీ ప‌రీక్షలు చేయించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్లల‌కు కార‌ణం లేకుండా క‌డుపునొప్పి రావ‌డం, త‌ర‌చు మూత్ర విస‌ర్జన‌కు ఇబ్బంది ప‌డ‌డం లాంటి ల‌క్షణాలుంటే వెంట‌నే వైద్యుల‌కు చూపించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..