వేసవి వేడి మాములుగా లేదు..! ఎండలు మండిపోతున్నాయి..ఈ ఫుడ్స్ తినడం మానేయండి..!
వేసవి కాలంలో శరీరం వేడి పెరగడం సహజం. ఈ కాలంలో తినే ఆహారం శరీరానికి అనుకూలంగా ఉండాలి. లేకుంటే డీహైడ్రేషన్, అలసట, జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉప్పు, కారం, వేయించిన ఆహారాలు, టీ, కాఫీ వంటి పదార్థాలను తగ్గించాలి. వేసవిలో చల్లని డ్రింక్ లు, పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

వేసవి కాలం ప్రారంభం అవ్వడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో శరీరం వేడి సహజంగా పెరుగుతుంది. అందువల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవడమే కాకుండా తినే ఆహారపదార్థాలు కూడా శరీరానికి అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని ఆహారాలను పూర్తిగా తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి కాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు, అలసట, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. పైగా కొన్ని ఆహారాలను తినడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఆహారాలను తగ్గించడం అవసరం.
వేసవిలో అధిక ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలుపుదల తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో మంటలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో ఉప్పును తగ్గించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనితో పాటు అధిక ఉప్పు ఉన్న తినుబండారాలను కూడా తగ్గించడం అవసరం.
టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. వీటిలో ఉండే కెఫిన్ వల్ల జీర్ణ సమస్యలు కూడా కలుగుతాయి. కాబట్టి వేసవిలో టీ, కాఫీలకు బదులుగా చల్లని పానీయాలు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం శ్రేయస్కరం.
వేసవిలో ఊరగాయలు తినడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోవడం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఊరగాయల్లో ఉప్పు అధికంగా ఉండడంతో శరీరం వేడి అవ్వడం, నిర్జలీకరణం సమస్యలు రావడం సాధారణం. కాబట్టి వేసవిలో ఊరగాయలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుంది. దీనితో శరీరంలో చెమట ఎక్కువగా పడటం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో కారంగా ఉండే ఆహారాలను తగ్గించడం ఆరోగ్యానికి అనుకూలం.
వేయించిన ఆహారాలు వేసవిలో జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. సమోసాలు, పిజ్జా, బర్గర్లు వంటి వేయించిన ఆహారాలు వేసవిలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇవి శరీరానికి హానికరం కావడంతో వీటిని తగ్గించడం అవసరం.
డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్, చిరాకు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో డార్క్ చాక్లెట్‌ను తగ్గించడం ఉత్తమం.
వేసవిలో ఈ ఆహారాలను తగ్గించడం వల్ల శరీరంలో నీరు నిలువ ఉండి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. పండ్ల రసాలు, మజ్జిగ వంటి చల్లని ద్రవాలు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.