Sugar Control Tips: షుగర్‌తో ఫికర్‌ అవుతున్నారా.? ఇవి తినండి బిందాస్‌గా ఉండండి..

| Edited By: Anil kumar poka

Jan 10, 2023 | 1:11 PM

షుగర్ సమస్య నుంచి రక్షణకు మెడిసిన్ ఎంత అవసరమో? అలాగే ఆహార అలవాట్లతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు సూచించే సూపర్ ఫుడ్స్ ఏంటో ఓ సారి చెక్ చేద్దాం.

Sugar Control Tips: షుగర్‌తో ఫికర్‌ అవుతున్నారా.? ఇవి తినండి బిందాస్‌గా ఉండండి..
Protein Food
Follow us on

ప్రస్తుత కాలంలో వయస్సుతో ప్రమేయం లేకుండా అందరిని షుగర్ సమస్య వేధిస్తుంది. కొంత మందికి వంశపారంపర్యంగా షుగర్ సమస్య వేధిస్తున్నా..మరికొంత మందికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చిన్న వయస్సులోనే షుగర్ ఎటాక్ చేస్తుంది. ఓ సారి షుగర్ వస్తే దాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సిన దుస్థితి. కొంత మందికి ట్యాబ్లెట్ల స్థాయి పోయి ఏకంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కడుపు నిండుగా తినాలన్నా భయమే..కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలి. ఒక్కోసారి తినడం కొంచెం ఆలస్యమైన వెంటనే నీరసం వచ్చేస్తుంది. సో ఇలాంటి బాధలు ఎన్నో షుగర్ వ్యాధిగ్రస్తులు అనుభవిస్తుంటారు. అయితే షుగర్ సమస్య నుంచి రక్షణకు మెడిసిన్ ఎంత అవసరమో? అలాగే ఆహార అలవాట్లతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు సూచించే సూపర్ ఫుడ్స్ ఏంటో ఓ సారి చెక్ చేద్దాం.

త్రుణధాన్యాలు:

వోట్స్, బార్లీ, కిన్నోవా వంటి త్రుణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సాయం చేస్తాయి. సో షుగర్ వ్యాధిగ్రస్తులు డైలీ త్రుణధాన్యాలు తింటే బెటరని నిపుణుల సూచన

చియా గింజలు :

చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడంతో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

పండ్లు :

నిర్థిష్టమైన పండ్లను తరచూ తీసుకోవడం రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రాబెర్రీ, యాపిల్స్, ద్రాక్ష వంటి పండ్లను తింటే టైప్ -2 డయాబెటిస్ ను అరికట్టవచ్చు.

కూరగాయలు :

కూరగాయల్లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ తో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. పొట్లకాయ, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, పచ్చి బఠాణి, క్యారెట్ వంటి ఆరోగ్యకరమైన కూరగాయలను కచ్చితం ఆహారంలో చేర్చుకోవాలి.

వెల్లుల్లి :

వెల్లుల్లి తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధంలా పని చేస్తుంది. ఇది షుగర్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్, ఇన్ ఫ్లమేషన్, ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా దూరం చేస్తుంది. 

ధనియాలు :

ధనియాలు రక్తంలోని చక్కెరను నియంత్రించే ఎంజైమ్ లను సక్రియం చేయడం ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. 

ఆపిల్ సైడర్ వెనిగర్ :  

పులియబెట్టిన ఎసిటిక్ యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిల ప్రతిస్పందనను 20% తగ్గించడానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం