
ఈ రోజుల్లో మహిళలకు PCOS (Polycystic ovary syndrome) సమస్య సర్వ సాధారణమైపోయింది. పెళ్లైన మహిళలు, పెళ్లికాని ఆడపిల్లలు కూడా ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. PCOS సమస్య ఉన్నవారికి పీరియడ్స్ సరిగ్గా రావు. అలాగే శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. జుట్టు రాలడం, తలనొప్పి, మొటిమలు వస్తాయి. అండాలు సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల సంతానలేమి సమస్య కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఏయే ఆహారాలు తినకూడదు.. ఏయే ఆహారాలు తింటే సమస్యను అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
-PCOS సమస్య ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు తదితర ఆహారాలను తినడం వీలైనంత వరకూ తగ్గించాలి. ఎక్కువగా శాఖా హారాన్నే తినేందుకు ప్రయత్నించాలి.
-క్యారెట్, బీట్ రూట్, పాలకూర ప్రతిరోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట మూడింటిలో ఏదొక జ్యూస్ ను 28 రోజుల పాటు తాగితే రక్తం శుద్ధి జరిగి.. గర్భాశయంలో దోషాలు ఏర్పడకుండా ఉంటాయి. మెంతులు, వాము, పప్పుదినుసులు ఎక్కువగా తీసుకోవాలి.
-PCOS ఉన్నవారు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నువ్వుల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మహిళలు వీటిని తింటే.. కణాల నిర్మాణం జరిగి శక్తి లభిస్తుంది.
-జీలకర్ర, సోంపుగింజలు, ధనియాలు, యాలకులను కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జీలకర్ర, సోంపు మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ధనియాలు, యాలకులు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తాయి. అలాగే దానిమ్మ, నల్ల ద్రాక్షలను తింటే రక్తం శుద్ధి అవుతుంది. గర్భాశయానికి తాజా ఆక్సిజన్ అందుతుంది.
ఈ ఆహారాలతో పాటు.. ప్రతిరోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. యోగాలో ఉష్ట్రాసనం, నౌకాసనం, బద్ధకోణాసనాలను వేస్తే PCOS సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి