Heath Tips: సరైన నిద్ర లేకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువే.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు…

|

Jun 26, 2021 | 10:34 AM

మానవ శరీరానికి తగినంత నిద్ర ఉండాలని చెబుతుంటారు. సాధారణంగా ఒక వ్యక్తికి ఆరు నుంచి ఎనిమిది గంట నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు.

Heath Tips: సరైన నిద్ర లేకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువే.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు...
Poor Sleep
Follow us on

మానవ శరీరానికి తగినంత నిద్ర ఉండాలని చెబుతుంటారు. సాధారణంగా ఒక వ్యక్తికి ఆరు నుంచి ఎనిమిది గంట నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. ఒకవేళ తగినంత నిద్ర లేకపోతే.. మన జీవన శైలి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. మానసిక ఒత్తిడితోపాటు అలసట, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. శరీరానికి తగినంత నిద్రలేకపోతే… మరణానికి దారితీస్తుందని.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్ బోధకుడు రెబెకా రాబిన్సన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. శరీరానికి సరైన నిద్ర అనేది.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు.. అకాల మరణం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి సమస్యలతో నిద్రలేమి బారిన పడుతున్నారు. ప్రపంచ జనాభాలో 45 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. 5 నుంచి 70 మిలియన్ల అమెరికన్ పౌరులు స్లీప్ డిజార్టర్, స్లీప్ అప్నియా, నిద్రలేమి, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. సీడీఎస్ దీనిని ప్రజారోగ్య సమస్యగా పేర్కోంది. ఇందుకు కారణం.. తక్కువ నిద్ర, రక్తంలో షుగర్ లెవల్స్ లో మార్పు, స్ట్రోక్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 2011 – 18 సంవత్సరాల మధ్య చాలా మంది నిద్రపోయే అలవాట్ల డేటాను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో అనేక వ్యాధుల బారిన పడుతుంటారని అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ లో ప్రచురించబడిన పరిశోధనను నేషనల్ హెల్త్ అండ్ ఏజింగ్ స్టడీ నిద్రలేమి సమస్యపై అధ్యయనంపై నిర్వహించింది.

Also Read: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.

Hariteja: ముఖం చూపించకుండానే పాప పేరెంటో చెప్పిన హరితేజ.. ఇంతకీ ఏం పేరు పెట్టిందో తెలుసా..

Neena Gupta: సెల్స్ గర్ల్‏గా మారిన నటి.. అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నటి…. అసలు విషయం చెప్పిన నీనా గుప్తా…