Antibiotics: విచ్చలవిడిగా అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ వినియోగం.. తాజా అథ్యయనంలో విస్తుపోయే విషయాలు ఎన్నో..

|

Sep 08, 2022 | 9:16 AM

ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆరోగానికి సంబంధించిన మందుతో పాటు యాంటీబయోటిక్స్ వాడేస్తాం. డాక్టర్ల చిటీ లేకపోయినా మందుల షాపుకు వెళ్లినా యాంటీబయోటిక్స్

Antibiotics: విచ్చలవిడిగా అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ వినియోగం.. తాజా అథ్యయనంలో విస్తుపోయే విషయాలు ఎన్నో..
Antibiotics
Follow us on

Antibiotics: ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆరోగానికి సంబంధించిన మందుతో పాటు యాంటీబయోటిక్స్ వాడేస్తాం. డాక్టర్ల చిటీ లేకపోయినా మందుల షాపుకు వెళ్లినా యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తారు. అయితే యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నా.. వాటి వాడకం మాత్రం తగ్గడంలేదు. ఈయాంటీబయోటిక్స్ వినియోగానికి సంబంధించి తాజాగా విడుదలైన ఓ అధ్యయనంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రయివేట్ వైద్య రంగంలో వినియోగిస్తున్న 47 యాంటీబయోటిక్స్ కు అనుమతులు లేవని వెల్లడైంది. సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ అనుమతులు లేని యాంటీబయోటిక్స్‌ను సైతం వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. 2019లో దేశంలో ఉపయోగించిన వాటిలో 47 శాతానికి పైగా యాంటీబయోటిక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌–సౌత్‌ఈస్టు ఆసియా’ జర్నల్‌లో ప్రచురించారు. 2019లో అత్యధికంగా అజిత్రోమైసిన్‌ 500 MG ట్యాబ్లెట్‌ను 7.6 శాతం మంది, సెఫిక్సైమ్‌ 200 MG ట్యాబ్లెట్‌ను 6.5 శాతం మంది ఉపయోగించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇదంతా ప్రైవేట్‌ రంగానికి సంబంధించిందేనని ఈఅధ్యయనం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ రంగంలో వాడిన యాంటీబయోటిక్స్‌ను ఈజాబితాలో చేర్చలేదు. అనుమతుల్లేని యాంటీబయోటిక్స్‌ ఫార్ములేషన్స్‌లో తొలి మూడు స్థానాల్లో సెఫాలోస్పారిన్స్, మాక్రోలైడ్స్, పెన్సిల్సిన్స్‌ ఉన్నాయి.

భారత్ లో యాంటీబయోటిక్స్‌ వాడకంపై నిఘా పెట్టేందుకు సరైన వ్యవస్థలు లేకపోవడంమే విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగానికి కారణమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప.. యాంటీబయోటిక్స్ డ్రగ్స్ ను వాడొద్దని హెచ్చరిస్తున్నారు. తాత్కలిక ఉపశమనం కోసం ఎక్కువుగా ఈ మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..