Steam Bath Benefits: స్టీమ్ బాత్ చేస్తే.. అలాంటి సమస్యలు మటుమాయమట.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు

Steam Bath Health Benefits: రిఫ్రెష్ కోసం మనమందరం ప్రతిరోజూ స్నానం చేస్తాం. నేటి కాలంలో.. స్నానమాచరించడం కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్‌నెస్‌లో

Steam Bath Benefits: స్టీమ్ బాత్ చేస్తే.. అలాంటి సమస్యలు మటుమాయమట.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
Steam Bath Benefits
Follow us

|

Updated on: Dec 24, 2021 | 1:09 PM

Steam Bath Health Benefits: రిఫ్రెష్ కోసం మనమందరం ప్రతిరోజూ స్నానం చేస్తాం. నేటి కాలంలో.. స్నానమాచరించడం కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్‌నెస్‌లో భాగమైంది. ఆవిరి స్నానం (స్టీమ్ బాత్) చేస్తే అది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. స్టీమ్ బాత్ (ఆవిరి స్నానానికి) కు ఆయుర్వేదంతోపాటు వైద్యశాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. ఆవిరి స్నానం చేయడం వల్ల మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా.. చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అవును.. శీతాకాలంలో మనందరం చలికి దూరంగా ఉండేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తాం. కానీ మీకు తెలుసా.. ఆవిరి స్నానం చలి నుంచి మనల్ని సురక్షితంగా కాపాడతుంది. అలాగే శరీరంలోని అలసట, కీళ్ల సమస్యలను తొలగిస్తుందని అధ్యయనంలో తేలింది.

అంతే కాదు స్టీమ్ బాత్ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి స్టీమ్ బాత్ వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా వేడిగా మారుతుంది. దీని కారణంగా… మేము వేడి శ్వాసను కూడా తీసుకుంటాము. దీని నుంచి వచ్చే వేడి శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లడం ద్వారా కఫాన్ని బయటకు తీయడంలో సహాయపడుతుంది. స్టీమ్ బాత్‌ను చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. కావున ఆవిరి స్నానం.. ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. హృద్రోగులకు స్టీమ్ బాత్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్టీమ్ బాత్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. మీరు ప్రతిరోజూ స్టీమ్ బాత్ చేస్తుంటే, మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు చర్మాన్ని కాంతి వంతంగా మార్చుకోవచ్చు. వేసవి కాలంలో చెమటలు పట్టడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆవిరి స్నానం చేస్తే శరీరంలోని మురికి తొలగిపోవడంతో పాటు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.

రక్తపోటును తగ్గిస్తుంది.. ఒక అధ్యయనం ప్రకారం.. ఆవిరి స్నానం చేసే వ్యక్తుల శరీరం నుంచి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఈ స్నానం చేస్తే మీ రక్త ప్రసరణ ఎల్లప్పుడూ చక్కగా ఉంటుంది. దీంతోపాటు మీరు అనేక రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో.. ఆవిరి స్నానాలు కండరాలు, కీళ్లలో దృఢత్వం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది అంతే కాదు.. మీరు సరైన మార్గంలో స్టీమ్ బాత్ తీసుకుంటే.. అది కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ బరువు తగ్గడానికి దారితీస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఇది ల్యూకోసైట్‌లను ప్రేరేపిస్తుంది. ఇది కణాలను ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఆవిరి స్నానం మీ రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

స్టీమ్ బాత్ మనస్సును ఉల్లాసపరుస్తుంది. దీనితో పాటు, ఇది శరీరం నుంచి అలసట, నిద్రలేమి సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతే కాదు ఆవిరి స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. నిపుణులు సాధ్యమైతే స్టీమ్ బాత్ బెస్ట్ అంటూ సూచిస్తున్నారు.

Also Read:

ఈ అలవాట్లు మానుకోక పోతే మీకు వృద్దాప్యం ముందే వస్తుంది.. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Fish Benefits: చేపలు ఎక్కువగా తినేవారికి అలాంటి సమస్యలు రావు.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..