Soft Drinks Side Effects: కూల్‌ డ్రింక్స్‌ మీరూ తాగుతున్నారా? త్వరలోనే మీకు లివర్‌ క్యాన్సర్ గ్యారెంటీ..

|

Feb 08, 2024 | 9:09 PM

శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. శీతల పానీయాలు తాగితే సంతృప్తిగా అనిపించినప్పటికీ.. ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటువంటి పానీయాలు సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం. శీతల పానీయాలు సేవిస్తే బరువు పెరుగుతామని చాలామంది మహిళలు భావిస్తారు. బరువు మాత్రమే కాదు.. సోడా పానీయాలు కాలేయ క్యాన్సర్, హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని..

Soft Drinks Side Effects: కూల్‌ డ్రింక్స్‌ మీరూ తాగుతున్నారా? త్వరలోనే మీకు లివర్‌ క్యాన్సర్ గ్యారెంటీ..
Soft Drinks Side Effects
Follow us on

శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. శీతల పానీయాలు తాగితే సంతృప్తిగా అనిపించినప్పటికీ.. ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటువంటి పానీయాలు సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం. శీతల పానీయాలు సేవిస్తే బరువు పెరుగుతామని చాలామంది మహిళలు భావిస్తారు. బరువు మాత్రమే కాదు.. సోడా పానీయాలు కాలేయ క్యాన్సర్, హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్నిసార్లు బిర్యానీతో, కొన్నిసార్లు పిజ్జా-బర్గర్‌తో సోడాతో.. చాలా సార్లు సరదాకి తీపి-రుచి శీతల పానీయాలను విచ్చలవిడిగా తాగేస్తుంటాం. ఇటువంటి పానీయాల దీర్ఘకాలిక వినియోగం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

బర్మింగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన భారతీయ పరిశోధకుల బృందం దీనిపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో దాదాపు లక్ష మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా రుతుక్రమం ఆగిన వారు. అంటే 50 ఏళ్లు పైబడిన వారు. 20 సంవత్సరాలకుపైగా పరిశోధన తర్వాత, చక్కెర సోడాలు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వీరి పరిశోధనలో తేలింది. ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకునే వారికి ఇతరులతో పోలిస్తే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 85 శాతం ఎక్కువ.

శీతల పానీయాలు పురుషులు లేదా మహిళలు ఎవరికీ ప్రయోజనకరమైనవి కావు. వీటిల్లో పోషకాలు ఉండవు. బదులుగా, ఇటువంటి పానీయాలను కృత్రిమ చక్కెరతో తయారు చేస్తారు. ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, కాలేయం దెబ్బతినడం, జీర్ణ సమస్యలు వస్తాయి. శీతల పానీయాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పురుషుల కంటే మహిళల్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. లివర్ క్యాన్సర్ తో పాటు ప్రెగ్నెన్సీ, గుండెపోటు, గౌట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మహిళల్లో ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కాలేయ మంట వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయ క్యాన్సర్‌తో పాటు, రొమ్ము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా శీతల పానీయాల వినియోగం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. దానితో వయసు పెరిగిన వారిలా కనిపిస్తారు. మరోరకంగా చెప్పాలంటే, చిన్న వయస్సలోనే శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

శీతల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. ఇది మొదట హెపటైటిస్, తరువాత హెపాటిక్ కార్సినోమా పెరుగుదలకు కారణం అవుతుంది. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి తీపి రుచి కలిగిన సోడా పానీయాలకు దూరంగా ఉండటం చాలా బెటర్‌. వీటికి బదులుగా ద్రాక్ష రసం, బీట్‌రూట్ రసం, నిమ్మరసం లేదా గ్రీన్ టీ వంటివి తాగాలంటున్నారు నిపుణులు. ఇటువంటి ఆరోగ్యకరమైన పానీయాలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీర రోగనిరోధక శక్తినీ పెంచుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.