వెజిటేబుల్స్ ఏమైనా.. వాటిలో పోషక విలువలు చాలా ఉంటాయి. అయినా మనం సరిగ్గా తినం. అయినా ఇంట్లో చేసిన ఫుడ్ లో ఉండే ప్రయోజనాలే వేరు. కూరగాయల్లో ఒకటి బెండకాయ. ఈ లేడీ ఫింగర్ తో చాలా అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. అయితే కొంతమందికి బెండకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. బెండకాయని ఎన్ని రకాలు చేసి పెట్టినా.. అస్సలు తినరు. కనీసం వారంలో ఒక్కసారైనా బెండకాయను తినాలి. అయితే ఒక్కసారి ఈ బెండకాయతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుంటే మాత్రం.. దూరం పెట్టరు. వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తే.. చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో ఒక సారి తెలుసుకుందాం.
బెండకాయలో ఉండే పోషకాలు:
బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ కే వంటివి ఉంటాయి. తరచూ వీటిని తింటే కంటి ఆరోగ్యానికి సహాయ పడుతుంది. నాడీ వ్యవస్థను మెరుగ్గా చేస్తుంది. ఎముకలు, దంతాలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అలాగే స్ట్రోక్ వంటి సమస్యలను దూరం అవుతాయి.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
బెండకాయలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. హార్ట్ ఆరోగ్యంగా పని చేస్తుంది.
బరువు తగ్గుతారు:
బెండకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి.. ఇది కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినరు. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలు ఉండవు:
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో కల్తీ ఆహారం తిని.. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు బెండకాయ తిని ఆ ఇబ్బందులు తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది:
శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో, శరీరంలో ఉన్న మంటలను బెండకాయలు బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే బెండకాయలు తింటే క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. మళ్లీ అవి అభివృద్ధి చెందకుండా చేస్తే సామర్థ్యం బెండకాయలకు ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి