భారతీయ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అయితే చింత చిగురుతో అనేక రకాలైన వంటను చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్ లో వేసి చేస్తారు. వీటి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురులోని పులుపు.. వంటకే రుచిని ఇస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చింత చిగురును మన వంటల్లో ఉపయోగించే వారు పెద్దలు. అలాగే చింత చిగురును ఎండ బెట్టి పొడిగా చేసి కూడా వంట్లో ఉపయోగిస్తారు. చింత చిగురు కంది పప్పు, చింత చిగురు రొయ్యలు, చికెన్ కాంబినేషన్స్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. వాటిని తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మరి చింత చిగురుతో కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
రక్త హీనత ఉండదు:
చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్త హీనత సమస్య తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఇది మంచి బలాన్ని అందించే ఆకు కూర.
కామెర్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు:
చింత చిగురుకు కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా ఉంది. చింత చిగురు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకు రావచ్చు.
వాత సమస్యలు ఉండవు:
చింత చిగురును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల వాతం వల్ల వచ్చే సమస్యలు తగ్గతాయి. అలాగే మూల వ్యాధుల నుండి కూడా ఉప శమనం లభిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి:
గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురును ఉపయోగించవచ్చు. చింత చిగురును నీటిలో మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులి పురుగులు నశిసిస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
చింత చిగురును తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలతో బాడీ పోరాడుతుంది.
థైరాయిడ్ ను నియంత్రిస్తుంది:
థైరాయిడ్ సమస్యతో బాధ పడే వారు చింత చిగురును తినవచ్చు. చింత చిగురు తినడం వల్ల థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది
చెడు కొవ్వును తగ్గిస్తుంది:
చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో.. చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో గ్యాస్, మల బద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.