Mustard Benefits: వంటల్లో ఆవాల్ని ఎంత వాడితే మంచిది? ఆవాలతో మీకు తెలియని రహస్యాలెన్నో!!

| Edited By: Ram Naramaneni

Sep 27, 2023 | 7:27 PM

ఆవాలు.. పోపు దినుసుల్లో ఒకటి. ఇవి లేని పోపును ఊహించలేం. చారు తాలింపు మొదలు కూరల్లో కూడా ఆవాలను విరివిగా ఉపయోగిస్తూంటాం. చూడటానికి చిన్నగా, గుండ్రంగా ఉంటాయి కానీ.. వీటిలో ఆరోగ్య రహస్యాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. ఆవాల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగిస్తూంటారు. ఆవాల నూనెతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆవాలను తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయట పడొచ్చన్న..

Mustard Benefits: వంటల్లో ఆవాల్ని ఎంత వాడితే మంచిది? ఆవాలతో మీకు తెలియని రహస్యాలెన్నో!!
Mustard Benefits
Follow us on

ఆవాలు.. పోపు దినుసుల్లో ఒకటి. ఇవి లేని పోపును ఊహించలేం. చారు తాలింపు మొదలు కూరల్లో కూడా ఆవాలను విరివిగా ఉపయోగిస్తూంటాం. చూడటానికి చిన్నగా, గుండ్రంగా ఉంటాయి కానీ.. వీటిలో ఆరోగ్య రహస్యాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. ఆవాల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగిస్తూంటారు. ఆవాల నూనెతో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆవాలను తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయట పడొచ్చన్న విషయం మీకు తెలుసా. పూర్వం నాటు వైద్యాల్లో ఆవాలు, ఆవాల పొడి, ఆవాల నూనెను ఉపయోగించేవారు. ఆవాలను ఎంత వాడితే అంత మంచిది. అందుకే తాళింపుల్లో ఆవాలను ఉపయోగించడం ఆరంభించారు పెద్దలు. వీటితో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ఆవాల్లో ఇమ్యూనిటీని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్ ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటితో పోరాడుతుంది.

ఇవి కూడా చదవండి

తగిలిన గాయాలు త్వరగా మానతాయి:

ఆవాల్లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాల వల్ల తగిలిన గాయాలు త్వరగా మానతాయి. ఆవాల పొడిని గాయాలు తగిలిన చోట చల్లితే ఫాస్ట్ గా గాయం నుంచి రికవరీ అవ్వొచ్చు.

దంత సమస్యలు తగ్గించుకోవచ్చు:

చాలా మంది దంత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఆవాలు తినడం వల్ల దంత సమస్యలు కూడా తక్కువగా వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఇక అప్పుడప్పుడు పంటి నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఆవాలు మరిగించిన నీటిని తాగడం వల్ల లేదా పుక్కలించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

చాలా మంది కీళ్ల నొప్పులతో బాధ పడుతూంటారు. నొప్పులతో ఏ పని చేయాలన్నా, నడవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వారు ఆవాలు, కర్పూరం కలిపి పొడి చేసుకోవాలి. దీనికి కాస్త నీళ్లు కలిపి మోకాళ్లకు రాయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

గజ్జి, తామర పోతాయి:

కొంత మంది గజ్జి, తామర వంటి సమస్యలతో బాధ పడుతూంటారు. ఆవాలను మెత్తగా నూరి.. దాన్ని గజ్జి, తామర మీద రాయాలి. ఇలా చేస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.