Eggplants Benefits: వంకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే షాక్ అవుతారు!

|

Sep 03, 2023 | 9:36 PM

సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కాయగూరల్లోనే పోషలకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటిని ఎవరూ పట్టించుకోరు. పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్న వాళ్లు అయితే తెలీదు కాబట్టి.. తినడానికి మారాం చేస్తారు.. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు.. పక్కన పెట్టేస్తూంటారు. కూరగాయల్లో ఒకటి వంకాయ. దీనిలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సీ, ఫైటోన్యూట్రియెంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం..

Eggplants Benefits: వంకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే మీరే షాక్ అవుతారు!
Eggplants Benefits
Follow us on

సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కాయగూరల్లోనే పోషలకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటిని ఎవరూ పట్టించుకోరు. పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్న వాళ్లు అయితే తెలీదు కాబట్టి.. తినడానికి మారాం చేస్తారు.. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు.. పక్కన పెట్టేస్తూంటారు. కూరగాయల్లో ఒకటి వంకాయ. దీనిలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సీ, ఫైటోన్యూట్రియెంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే కొంత మందికి వంకాయ పడదు.. స్కిన్ ఎలర్జీలు వస్తాయి. అలాంటి వారి సంగతి పక్కన పెడితే.. వంకాయ తినని వారు మాత్రం.. చాలా మిస్ అవుతున్నట్లే. వంకాయలో అన్నీ ఇన్నీ పోషకాలు కావు.. చాలా ఉన్నాయి. మరి అవేటో ఒకసారి చూసేద్దామా.

– వంకాయ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
– బాడీలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది
– రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది
– దీనిలో విటమిన్ బీ3, బీ6, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్, పొటాషియం తదితర పోషకాలు ఉన్నాయి.
– వంకాయ గుండె పోటు, స్ట్రోక్ ముప్పులను తగ్గిస్తుంది.
– అలాగే శరీరంలో ఉండే ఎక్స్ ట్రా ఐరన్ ను తొలగిస్తుంది.
– వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి.. బరువును నియంత్రణలో ఉంచుంది
– శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను తొలగిస్తుంది
– జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
– మెదడు పని తీరులో పెరుగుదలను పెంచుతుంది
– వంకాయలు తినడం వల్ల ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి.
– వంకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ కనాల నుండి రక్షిస్తుంది.
– వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. రక్త హీనత సమస్య తగ్గుతుంది.
– వంకాయలో ఉండే పాలఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
– నిద్ర లేమి సమస్యలను తగ్గిస్తుంది.
– వాత, పిత్తం, మలబద్దకం, గొంతు నొప్పి, ఉబ్బసం, ఊబకాయం కాలేయ వ్యాధులు వంటి వాటిని నయం చేసే వాటిల్లో వంకాయ ఒకటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి