Coconut Water
కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అనవసరం. వీటి గురించి అందరికీ తెలుసు. కొబ్బరి నీళ్లతో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది కోకోనెట్ వాటర్ ని కేవలం వేసవిలో లేదా ఎండ ఎక్కువగా ఉన్న టైమ్ లో తీసుకుంటూ ఉంటారు. కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల బాడీ డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. లో కేలరీ, లో షుగర్ ఉన్న నీళ్లు కొబ్బరి నీళ్లు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎంచక్కా కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు. అలాగే ఎక్కువగా చెమట పట్టేవారు కూడా ఈ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. అయితే కొంతమంది రెగ్యులర్ గా కోకోనట్ వాటర్ ని తీసుకుంటూ ఉంటారు. ఇలా రోజూ తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది: కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగితే.. కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగిస్తుంది. అలాగే రాళ్లను ఏర్పరిచే ఖనిజాల సాంద్రతను తగ్గిస్తుంది.
- ఇన్ ఫెక్షన్లు రానివ్వదు: కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఇన్ ఫెక్షన్లను వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. యూరిన్ ఇన్ ఫెక్షన్స్ తో బాధపడేవారు కోకోనట్ వాటర్ ను తీసుకుంటే కంట్రోల్ లోకి తీసుకురావచ్చు.
- చర్మం ఆరోగ్యంగా ఉంటుంది: కోకోనట్ వాటర్ ని తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై మృత కణాలు తొలగిపోవడంతో పాటు, ముడతలు, ఫైన్ లైన్స్ వంటికి రానివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నీళ్లలో చర్మానికి అవసరమయ్యే విటమిన్లు ఇ, సి ఉంటాయి. ఇవి స్కిన్ ని కాంతివంతంగా తయారు చేస్తాయి.
- జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది: కొబ్బరి నీళ్లలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అరుగుదల శక్తిని ఇస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా చేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
- రక్త పోటును తగ్గిస్తుంది: కోకోనెట్ వాటర్ రోజూ తాగితే రక్త పోటును రానివ్వడమే కాకుండా.. వచ్చిన దాన్ని అదుపులో ఉంచుతుంది. బీపీ ఉన్నవాళ్లకు ఇది బెటర్ డ్రింక్ అని చెబుతున్నారు నిపుణులు.
- గుండెకు మేలు చేస్తుంది: తరచూ కోకోనెట్ వాటర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. అంతే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- వీళ్లు తీసుకోకపోవడం ఉత్తమం: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. మూత్ర పిండాల వ్యాధితో బాధ పడేవారు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారికి మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి వీరు వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగినా అతిసారంతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.