Smartphone Addiction: నిద్రను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి.

|

Mar 17, 2021 | 10:48 PM

Smartphone Addiction: ఈ శతాబ్ధపు అద్భుత ఆవిష్కరణల్లో స్మార్ట్‌ఫోన్‌ ఒకటి. ఒకప్పుడు కేవలం సంభాషణలకు మాత్రమే పరితమైన మొబైల్‌ ఫోన్‌ వ్యవస్థ స్మార్ట్‌ ఫోన్‌ రాకతో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌ వైపు చూడాల్సిందే. ఇతరులతో...

Smartphone Addiction: నిద్రను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి.
Smart Phone
Follow us on

Smartphone Addiction: ఈ శతాబ్ధపు అద్భుత ఆవిష్కరణల్లో స్మార్ట్‌ఫోన్‌ ఒకటి. ఒకప్పుడు కేవలం సంభాషణలకు మాత్రమే పరితమైన మొబైల్‌ ఫోన్‌ వ్యవస్థ స్మార్ట్‌ ఫోన్‌ రాకతో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌ వైపు చూడాల్సిందే. ఇతరులతో మాట్లాడుకోవడం నుంచి మొదలు పెడితే, చాటింగ్‌, వీడియోలు, సోషల్ మీడియా, డబ్బులు పంపించుకోవడం ఇలా ప్రతీ అవసరానికి స్మార్ట్‌ ఫోన్‌ కేరాఫ్‌గా మారిపోయింది. అయితే ఏదైనా అతి అయితే అది అనార్థానికే దారి తీస్తుంది అనడానికి స్మార్ట్‌ఫోన్‌ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యూజర్లకు ఎన్నో పనులు చేసి పెడతోన్న స్మార్ట్‌ఫోన్‌ వారి ఆరోగ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది.
మితిమీరిన స్మార్ట్‌ ఫోన్‌ వాడకంతో వినియోగదారులు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. అయితే ఇదేదో ఆశామాషీగా చెప్పిన విషయం కాదు. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ తెలిపారు. లండన్‌కు చెందిన కింగ్స్‌ కాలేజీ చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం పరిశోధకులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 1043 మందిని పరిగణలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించి వివరాలను అడిగితెలుసుకున్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయినట్లు ఈ పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా అర్థరాత్రి దాటిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారిలో ఈ ప్రమాదం ఎక్కువ ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్‌లు ఉపయోగించే వారు నాణ్యత లేని నిద్రతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం వల్ల ఉదయం వారి పనితీరుపై కూడా దుష్ఫ్రభావం చూపుతుందని వారు చెప్పుకొచ్చారు.

ఈ చిట్కాలు పాటించండి..

మీరు కూడా స్మార్ట్‌ ఫోన్‌కు బానిసలుగా మారారా.? స్మార్ట్‌ ఫోన్‌ మీ నిద్రపై ప్రభావం చూపుతుందా.? అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

* స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో మీకు మీరు కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. ముఖ్యంగా రోజులో కొంత సమయం పాటు స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఆహారం తీసుకునే సమయంలో, మీ చిన్నారులతో గడిపే సమయంలో, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు.

* మీరు ఎక్కువగా ఎలాంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నారో వాటిని ముందుగా స్మార్ట్‌ఫోన్‌ నుంచి అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయాలి. ముఖ్యంగా మిమ్మల్ని స్మార్ట్‌ ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే సోషల్‌ మీడియా యాప్‌లను డిలీట్‌ చేసేయాలి.

* నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్‌ ఫోన్‌కు గుడ్‌ బై చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వెలువడే బ్లూ లైట్‌ మీ నిద్రపై ప్రభావం చూపుతుందనేది శాస్త్రవేత్తల వాదన.

Also Read: Supta Vajrasana Pose : ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. ఎన్నిమందులు వాడినా ఫలితం లేదా.. ఈ ఆసనం ట్రై చేసి చూడండి

ఆ బ్లడ్ గ్రూపు వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..

Whatsapp New Feature: వాట్సాప్‌ నుంచి మరో ఇంటరెస్టింగ్ ఫీచర్.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..!