Sloth Fever: అమెరికా, యూరప్‌లో వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, నివారణ పద్ధతులు ఏమిటంటే

|

Sep 02, 2024 | 5:44 PM

ఓరోపౌచ్ వైరస్ ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మిడ్జ్ అనే ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కొత్తది కానప్పటికీ. దీని మొదటి కేసు 1950లో నమోదైంది. అయితే ఈ ఏడాది మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. CDC ప్రకారం ఇప్పటివరకు స్పెయిన్‌లో 12, ​ఇటలీలో 5 , జర్మనీలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో బ్రెజిల్, బొలీవియా, పెరూ, కొలంబియా మరియు క్యూబాలో ఇప్పటివరకు 8,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల నుండి ప్రయాణించే ప్రయాణికుల ద్వారా న్యూయార్క్ , ఫ్లోరిడాకు కూడా ఈ జ్వరం వ్యాపించింది.

Sloth Fever: అమెరికా, యూరప్‌లో వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, నివారణ పద్ధతులు ఏమిటంటే
Sloth Fever
Image Credit source: Linda D Lester/500px/Getty Images
Follow us on

కరోనా వైరస్ ముప్పు నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. మరోవైపు రెండు కొత్త వైరస్ల ముప్పు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మంకీపాక్స్ తర్వాత, ఓరోపౌచ్ అనే వైరస్ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యాపించింది. CDC ప్రకారం యుఎస్‌తో సహా యూరోపియన్ దేశాలలో ఓరోపౌచ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఓరోపౌచ్ వైరస్ ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీనిని స్లాత్ ఫీవర్ అని కూడా అంటారు. బ్రెజిల్‌లో ఈ జ్వరం కారణంగా ఇప్పటికే ఇద్దరు మహిళలు కూడా మరణించారు.

ఓరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి?

వాస్తవానికి ఓరోపౌచ్ వైరస్ ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. కనుక ఇది కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధిగా పరిగణించబడుతుంది. ఇది మిడ్జ్ అనే సోకిన ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కొత్తది కానప్పటికీ. దీని మొదటి కేసు 1950లో నమోదైంది. అయితే ఈ ఏడాది మరిన్ని కేసులు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నిరంతరం పెరుగుతున్న కేసులు

CDC ప్రకారం ఇప్పటివరకు స్పెయిన్‌లో 12, ​ఇటలీలో 5 , జర్మనీలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో బ్రెజిల్, బొలీవియా, పెరూ, కొలంబియా మరియు క్యూబాలో ఇప్పటివరకు 8,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల నుండి ప్రయాణించే ప్రయాణికుల ద్వారా న్యూయార్క్ , ఫ్లోరిడాకు కూడా ఈ జ్వరం వ్యాపించింది.

ఈ జ్వరం ఎలా వ్యాపిస్తుందంటే..

వ్యాధి సోకిన ఈగలు, కీటకాలు కుట్టడం ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుందని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. ఈ వైరస్ అడవి ప్రాంతాల్లోని కీటకాలు, పక్షులు, కోతులు, మార్మోసెట్‌ల ద్వారా వ్యాపిస్తుంది. ఈ జంతువుల నుండి మానవులకు చేరుతుంది.

భారతదేశంలో కూడా ప్రమాదం పొంచి ఉందా..

ప్రస్తుతం భారతదేశంలో ఈ జ్వరం వచ్చే ప్రమాదం లేదని డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. ఇక్కడ చాలా తక్కువ కేసులు ఉన్నాయి. అయితే, డెంగ్యూ వంటి ఇతర వైరస్‌ల పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మలేరియా, చండీపురా నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఓరోపౌచ్ వైరస్ లక్షణాలు

ఈ వైరస్ సోకిన ఈగ లేదా దోమ కుట్టిన 7-10 రోజులలో ఓరోపౌచ్ వ్యాధి లక్షణాలను చూపడం ప్రారంభిస్తాయి.

ఆ లక్షణాలు ఏమిటంటే..

తీవ్ర జ్వరం

తలనొప్పి

వికారం

వాంతులు

అతిసారం

బలహీనత, అలసట అనుభూతి

కడుపు నొప్పి, కీళ్లలో నొప్పి

శరీరంపై ఎర్రటి దద్దుర్లు

ఈ లక్షణాలు సాధారణంగా 7 రోజుల్లో నయమవుతాయి. అయితే 70 శాతం మంది రోగులకు మళ్లీ ఈ జ్వరం రావచ్చు.

నివారణ పద్ధతులు
ఈ జ్వరాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఈగ , దోమల కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం. దీని కోసం చుట్టూ పక్కల పరిసరాల్లోని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

టీకా లేదా ఔషధం

ఇప్పటి వరకూ ఈ వైరస్ కు తగిన చికిత్స లేదు వ్యాక్సిన్ లేదు.. ఔషధం లేదు. చికిత్స తీసుకునే సముంలో తగినంత నీరు త్రాగాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఈ వైరస్ లక్షణాలు వారంలో తగ్గిపోయినా.. సమస్య తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేరడంలో ఆలస్యం చేయవద్దు.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..