Coronavirus: డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. ఆ జిల్లాలో చిన్నారులకు

|

Dec 31, 2023 | 7:42 AM

ఇక కోవిడ్ మరణాలు సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే కరోనా కారణంగా ఏడుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. వరంగల్‌లో తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నారు. కొత్తేడాదికి ముందు కరోనా జిల్లాలో దడ పుట్టిస్తోంది. చిన్నారులకు కరోనా...

Coronavirus: డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. ఆ జిల్లాలో చిన్నారులకు
Representative Image
Follow us on

ముగిసింది అనుకున్న కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. దేశంలో క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రోజురోజుకీ నెమ్మదిగా కేసులు సంఖ్య పెరగడం భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు నమోదుకావడం పెరుగుతోన్న తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 4వేలకు చేరువైంది.

ఇక కోవిడ్ మరణాలు సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే కరోనా కారణంగా ఏడుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. వరంగల్‌లో తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నారు. కొత్తేడాదికి ముందు కరోనా జిల్లాలో దడ పుట్టిస్తోంది. చిన్నారులకు కరోనా వైరస్‌ సోకడం కలవరపడుతోంది. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో వైద్యులు కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగానే 20 బెడ్స్‌తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఎంజీఎం సుపరిoటిండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్ భరోసా ఇస్తున్నారు. కరోనా బాధితులకు మంచి చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు.

ఇక కరోనా పాజిటివ్‌గా తేలిన చిన్నారుల్లో నలుగురిది ఒకటి నుంచి రెండేండ్ల మధ్య వయస్సే ఉండడం గమనార్హం. నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌కు పంపారు. ఒక్కరిని మాత్రమే అడ్మిట్‌ చేసుకున్నారు. ఇదిలా ఉంటే పెద్దపల్లిలో కూడా కరానో కేసులు నమోదయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..