Stress: స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా.. ఈ పద్ధతులు పాటిస్తే.. ఒత్తిడి చిత్తవ్వాల్సిందే..!

|

Jul 08, 2021 | 11:02 PM

కరోనా మహమ్మారితో బయట తిరగలేక... ఇంట్లో ఉండలేక చాలామంది ఈ మధ్య ఒత్తిడికి గురవుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

Stress: స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా.. ఈ పద్ధతులు పాటిస్తే.. ఒత్తిడి చిత్తవ్వాల్సిందే..!
Stress
Follow us on

Stress: కరోనా మహమ్మారితో బయట తిరగలేక… ఇంట్లో ఉండలేక చాలామంది ఈ మధ్య ఒత్తిడికి గురవుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనలు ఇలాంటివన్నీ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని అశ్రద్ధగా వదిలేస్తే.. మనపై మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి స్థితిలో మీరు ఉన్నట్లైతే.. కచ్చితంగా ఒత్తిడిని చిత్తు చేయాల్సిందే. లేదంటే దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతాయి. ఒత్తిడిని జయించేందుకు కొన్ని సింపుల్ పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటించి ఒత్తిడిపై విజయం సాధించవచ్చు. అవేంటో చూద్దాం..

1. హార్మోన్లలను ఉత్తేజ పరచడం
ఉల్లాసంగా ఉండాలంటే మనలో మంచి హార్మోన్లను ఉత్తేజపరచాలి. ఈ హార్మోన్లు మనందరిలో ఉంటాయి. వీటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండొచ్చు. సెరోటోనిన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అయితే మనకు ఉపయోగపడే కార్బోహైడ్రేట్లు లేకుండా సెరోటోనిన్ మన మెదడుకు అందదు. సెరోటోనిన్ హోర్మోన్ల ఉత్పత్తికి ట్రిప్టోఫాన్ అవసరం. అయితే మెదడులోని సెరోటోనిన్ రవాణాకు కార్బోహైడ్రేట్లు ముఖ్యమైనవి. గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అరటి, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, క్వినోవా, డార్క్ చాక్లెట్లు, బచ్చలికూర లాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన మానసిక స్థితిని పెంపొందించడానికి సహాయపడతాయి. పాలు, గుమ్మడికాయ గింజలు, అరటి పండు, చాక్లెట్ పౌడర్‌తో తయారు చేసిన సాధారణ మిల్క్ షేక్ మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే అశ్వగంధ నరాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. మనం తాగే పాలలో కానీ, మంచినీటిలో ఒక టీస్పూన్ అశ్వగంధ పొడి కలుపుకుని తాగితే మంచింది.

2. బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మానసిక స్థితిని మరింత ఉత్సాహంగా మార్చుకోవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కానీ, ఎక్కువగా తీసుకుంటే మాత్రం హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. మన బాడీలో డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని పేర్కొంటున్నారు. రోజుకు 4 కప్పుల బ్లాక్ టీ మాత్రమే తాగాలని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రతీ కప్పు బ్లాక్ టీకి మధ్య తప్పనిసరిగా రెండు గ్లాసుల నీరు తాగాలని డాక్టర్లు పేర్కొంటున్నారు.

3. ఎక్కువ పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే.. మెదడులో కొత్త కణాలు వేగంగా ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడతాయంట. మెదడులో బీడీఎన్ఎఫ్ (బ్రెయిన్ డెరైన్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) అనే సమ్మేళనాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. ఆపిల్, బెర్రీలు, ఉల్లిపాయలు, పచ్చి ఆకు కూరలు, చియా సీడ్స్, వాల్‌నట్స్, టమోటాలు లాంటివి ఎక్కువగా తీసుకుంటే మన మూడ్ కచ్చితంగా మారుతుందంట.

4. గ్రీన్ టీ
మానసిక స్థితిని మార్చుకోవాలంటే కచ్చితంగా మీరు మసాలా టీ కి బదులు గ్రీన్ టీ ని తీసుకోవాలంట. గ్రీన్ టీ, వైట్ టీ, బ్లాక్ టీలలో కాటెచిన్స్ అనే సమ్మేళనం ఉంటుందం. ఇది మన మూడ్‌ని కచ్చితంగా మార్చేందుకు సమాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే బరువుతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయంట. ఒత్తిడికి గురయినప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు వీటిని మొదటి ఛాయస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

5. వంట గదిలోని ఔషధాలు
మన వంట గదిలో చాలా అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఇవి మన మానసిక స్థితిని మార్చడంలో ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ లాంటి సుగంధ ద్రవ్యాలు అగ్రస్థానంలో నిలుస్తాయి. పాలల్లో చిటికెడు జాజికాయను కలిపి పడుకునే ముందు తీసుకుంటే.. మన బాడీని రిలాక్స్ చేయడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు వంటి ఇతర సుగంధ ద్రవ్యాలు మనం తినే ఆహారంలో చేర్చుకుంటే చాలు. ఆందోళన ఆటోమెటిక్ మాయమవుతుంది.

మరికొన్ని చిట్కాలు…

  • పడుకునే ముందు కాళ్లపై ఒక చుక్క స్వచ్ఛమైన ఆముదం రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి విశ్రాంతితోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • తక్షణ ఉపశమనం కోసం ముక్కులో 4 లేదా 5 చుక్కల నెయ్యిని వేసుకోవాలి.
  • ఒత్తిడిగా అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది.
  • వ్యాయామంతోపాటు మంచి నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. లేదంటే ఒత్తిడికి త్వరగా గురయ్యే అవకాశం ఉంటుంది.
  • పుస్తకాలను చదవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. అలాగే ధ్యానం, యోగా లాంటివి అలవాటు చేసుకుంటే మానసిక స్థితిలో కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది విశ్రాంతి. తగిన విశ్రాంతి లేనప్పుడు ఒత్తిడి మనల్ని చిత్తు చేస్తుంది. అందుకే సరైన విశ్రాంతి మనకు చాలా అవసరం.

Also Read:

Sleep Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా ? నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే…

Healthy Food: ఆరోగ్యం మన చేతుల్లోనే.. రోజూ తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం..!