Coconut Water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే.. ఎందుకో తెలుసా?

|

Feb 02, 2023 | 8:49 PM

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా చేస్తే ఏదైనా అనర్థమే. కొబ్బరి నీళ్ల విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పెరుగుతాయి.

Coconut Water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే.. ఎందుకో తెలుసా?
Coconut Water
Follow us on

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలామంచిది. అంతేకాదు రుచిగానూ ఉంటుంది. అందుకే సీజన్లతో సంబంధం లేకుండా ఈ హెల్దీ డ్రింక్‌ను తీసుకుంటారు చాలామంది. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు, చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిటాక్స్ చేసి కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.కొబ్బరి నీళ్లలో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమల సమస్యను తొలగించడానికి కొబ్బరి నీరు పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా చేస్తే ఏదైనా అనర్థమే. కొబ్బరి నీళ్ల విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పెరుగుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడం వల్ల చర్మం మెరుస్తుంది. అయితే కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. నిజానికి ఇందులో పొటాషియం ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే అనేక రోగాలకు కారణమవుతుంది.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది పరిమిత పరిమాణంలో శరీర పోషణకు మంచిది. కానీ కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

అతిసారం

కొబ్బరినీళ్లలో మోనోశాకరైడ్‌లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్‌లు, పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే, అవి శరీరం నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా విరేచనాలు, వాంతులు-విరేచనాలు, గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగకుండా అప్పుడప్పుడు మాత్రమే తాగండి.

షుగర్‌ లెవెల్స్‌

బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు అంటే మధుమేహం ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇందులో చక్కెరతో పాటు అధిక కేలరీలు ఉంటాయి. వీటివల్ల శరీరంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తక్కువ రక్తపోటుకు దారితీస్తాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీని కారణంగా, శరీరం రక్తపోటు స్థాయి అకస్మాత్తుగా పడిపోవచ్చు. ఫలితంగా అతిసారం, నీరసం వంటి సమస్యలు కలగవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..