Health: షుగర్‌ పేషెంట్స్‌ కోడి గుడ్డు తింటే ప్రమాదామా.? పరిశోధనలో తేలిన అంశాలివే..

|

Sep 10, 2022 | 6:55 AM

Health: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడే ఆరోగ్య సమస్య షుగర్‌. డయాబెటిక్‌ పేషెంట్స్‌ తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏ ఆహారం తీసుకోవాలనుకున్నా షుగర్‌ ఉంది ఏం కాదుగా....

Health: షుగర్‌ పేషెంట్స్‌ కోడి గుడ్డు తింటే ప్రమాదామా.? పరిశోధనలో తేలిన అంశాలివే..
Suger Patients Can Eat Egg
Follow us on

Health: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడే ఆరోగ్య సమస్య షుగర్‌. డయాబెటిక్‌ పేషెంట్స్‌ తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏ ఆహారం తీసుకోవాలనుకున్నా షుగర్‌ ఉంది ఏం కాదుగా అంటూ ప్రశ్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా రకాల అపోహలు ఉంటాయి. షుగర్‌ వ్యాధిగ్రస్తులు అపోహపడే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కొందరు డయాబెటిక్‌ పేషేంట్స్‌ కోడిగుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని భావిస్తుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా పరిశోధకులు ఓ అధ్యయాన్ని నిర్వహించారు. అంతేకాదు గుడ్లు తినే వారిలో హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గిన‌ట్లు అధ్య‌య‌న‌కారులు తెలిపారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అధ్యయనంలో భాగంగా నిపుణులు కొంతమందిని పరిగణలోకి తీసుకున్నారు వారిని మొత్తం మూడు గ్రూపులుగా విభజించి. వారిలో గరిష్టంగా 12 గుడ్లు కనిష్టంగా ఒక గుడ్డును ఇచ్చారు. ఇలా మూడు నెలలపాలు వారికి గుడ్లు ఇచ్చి ఆ తర్వాత అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ ప‌రిశీల‌న‌లో గుడ్లు ఎక్కువ‌గా తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనిపించలేవు. అంతేకాకుండా గుడ్లలో ఉండే ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డ‌యాబెటిక్ రోగులకు మేలు చేస్తున్నాయని నిపుణులు గుర్తించారు.

నోట్: పైన తెలిపిన అంశాలు అధ్యయనం ఆధారంగా వెల్లడించినవి. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఒక్కో వ్యక్తికి మారుతుంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్ణయమమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..