Red Banana Benefits: ఎర్ర అరటి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

|

Jul 09, 2022 | 12:13 PM

Red Banana Health Benefits: అరటి పండు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అయితే, ఇవి చాలా రకాలు..చాలా రంగులు కూడాను. వాటిలో పసుపు, ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉండే అరటిపండ్లను మనం తరచూ చూస్తుంటాం..అయితే, వీటిల్లో ఏవి మంచిది..అనే విషయం ఎంతమందికి అవగాహనలో ఉంటుందో తెలియదు గానీ, వీటిల్లో పసుపు, ఆకుపచ్చ అరటిపండ్లలో కన్నా ఎర్రటి అరటిపండ్లలోనే పోషకాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే కెరోటినాయిడ్లు, విటమిన్‌-సి ఇందులో అధికం. సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు […]

Red Banana Benefits: ఎర్ర అరటి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
Banana
Follow us on

Red Banana Health Benefits: అరటి పండు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అయితే, ఇవి చాలా రకాలు..చాలా రంగులు కూడాను. వాటిలో పసుపు, ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉండే అరటిపండ్లను మనం తరచూ చూస్తుంటాం..అయితే, వీటిల్లో ఏవి మంచిది..అనే విషయం ఎంతమందికి అవగాహనలో ఉంటుందో తెలియదు గానీ, వీటిల్లో పసుపు, ఆకుపచ్చ అరటిపండ్లలో కన్నా ఎర్రటి అరటిపండ్లలోనే పోషకాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే కెరోటినాయిడ్లు, విటమిన్‌-సి ఇందులో అధికం. సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు అయిన గ్యాలోక్యాటకిన్‌, గ్యాలేట్‌, డోపమైన్‌, ఎల్‌-డోప, క్యాటకోలమిన్స్‌ లాంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయిని చెబుతున్నారు.

ఎర్రటి అరటి పండులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ పండులో ఉండే బీటా కెరోటిన్ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎరుపు రంగు అరటి పండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ తరహాలో ఉండే ఫైటోస్టెరాల్‌ అనే సేంద్రియ సమ్మేళనం ఈ రకం అరటిపండ్లలో అధికంగా ఉంటుంది. ఇది రకరకాల వృక్ష సంబంధ పదార్థాల్లో దొరుకుతుంది. ఈ ఫైటోస్టెరాల్‌ జీర్ణవ్యవస్థలో శోషించుకుపోయి.. పొట్టలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. తద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అంతేకాదు.. ఈ అరటి పండు తినడం వల్ల చెస్ట్ అలర్జీని తగ్గిస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం ఎరుపు రంగు అరటిపండ్లలో ప్రతి గ్రాముకు 54 మైక్రో గ్రాముల డోపమైన్‌ ఉంటుంది. ఇది నరాలకు ప్రేరణను, మనసుకు ఉత్తేజాన్ని కలిగించే ఒక కర్బన రసాయనిక పదార్థం. భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకూ సహకరిస్తుంది. మెదడుతో ముడిపడిన పార్కిన్సన్స్‌లాంటి వ్యాధులను దరిచేరనీయదు. ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాంతో అతిగా తినడం మానేస్తాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎర్ర అరటిలోని పొటాషియం తోడ్పడుతుంది. తక్షణ శక్తినిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి