AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot: బీట్ రూట్‌ను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..? నిపుణులు ఏమంటున్నారు.?

బీట్‌రూట్ తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ను చాలా మంది రకరకాలుగా తీసుకుంటారు. కానీ దీనిని ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా..? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Beetroot: బీట్ రూట్‌ను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..? నిపుణులు ఏమంటున్నారు.?
అనంతరం ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేయాలి. అరగంట సేపు ఉంచుకుని తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఒక టీస్పూన్ తమలపాకు పొడి, రెండు టీస్పూన్ల పచ్చి పాలు, అర టీస్పూన్ బాదం నూనె బీట్‌రూట్‌ పేస్ట్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
Krishna S
|

Updated on: Jul 14, 2025 | 9:53 PM

Share

బీట్‌రూట్.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే కూరగాయ. చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోనాలు ఉన్నాయి. ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ కూరగాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. 100 గ్రాముల బీట్‌రూట్‌లో 43 కేలరీలు, 9.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.8 గ్రాముల ఫైబర్, 6.8 గ్రాముల చక్కెర, 1.6 గ్రాముల ప్రోటీన్ మరియు 0.2 గ్రాముల కొవ్వు ఉంటాయి. కానీ బీట్ రూట్ ఎలా తింటే మంచిది..? అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. అంటే బీట్ రూట్ ఉడికించి తింటే మంచిదా..? లేక వండుకుని తింటే మంచిదా..? అనే సందేహాలు వస్తుంటాయి. దీనికి సంబంధించిన ఆరోగ్య నిపుణులు ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉడికించిన బీట్‌రూట్ వల్ల కలిగే లాభాలు :

ఉడికించిన బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్ ఉడికించినప్పుడు దానిలోని ఫైబర్ మృదువుగా మారుతుంది. అందువల్ల అది త్వరగా జీర్ణమవుతుంది. గుండె ఆరోగ్యం, ఆక్సిజన్, కండరాల పనితీరును మెరుగుపరిచే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్ నిలుపుకోవడానికి బీట్‌రూట్‌ను ఉడికించడం మంచిది. ఉడికించిన బీట్‌రూట్ తినడం వల్ల శరీరానికి అవసరమైన నైట్రేట్లు లభిస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

పచ్చి బీట్‌రూట్ తినడం వల్ల కలిగే లాభాల:

బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. దీనిలోని ఫోలేట్ కణాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం వల్ల వాపు తగ్గుతుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, బీటాలైన్‌ల కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రిలీఫ్‌ను ఇస్తుంది. పచ్చిగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చి బీట్‌రూట్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఆరోగ్యానికి ఏది మంచిది?

ఆరోగ్యానికి ఉడికించిన లేదా పచ్చి బీట్‌రూట్.. రెండింటిలో ఏది మంచిది..? అని అంటే.. రెండూ ఆరోగ్యానికి మంచివి అని నిపుణులు చెబుతున్నారు. కానీ దీనిని పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. పచ్చి బీట్‌రూట్ శరీరానికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సహా మరిన్ని పోషకాలను అందిస్తుంది. ఉడికించిన బీట్‌రూట్‌లో ఫైబర్ మృదువుగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..