Raspberry: బరువు తగ్గించి అందమైన మెరిసే చర్మం కోసం ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి..!

|

Aug 21, 2022 | 10:49 AM

పోషక ఆరోగ్య ప్రయోజనాలకు ఈ పండు ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఐరన్, కాపర్, ఫోలిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. అవి ఎరుపు, నలుపు, ఊదా,బంగారం వంటి విభిన్న రంగులలో కనిపిస్తాయి.

Raspberry: బరువు తగ్గించి అందమైన మెరిసే చర్మం కోసం ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి..!
Raspberry
Follow us on

Raspberry Health Benefits: లాటిన్ పేరు రూబస్ ఇడియస్ ఒకటి రాస్ప్బెర్రీస్.దీనిని కోరిందకాయలుగా పిలుస్తారు. మృదువైన, జ్యూసీగా రుచికరమైన పండు (Raspberry) కోరిందకాయ..పోషక ఆరోగ్య ప్రయోజనాలకు ఈ పండు ప్రసిద్ధి చెందింది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఐరన్, కాపర్, ఫోలిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. అవి ఎరుపు, నలుపు, ఊదా,బంగారం వంటి విభిన్న రంగులలో కనిపిస్తాయి. మనకు సాధారణంగా దుకాణల్లో కనిపించే అత్యంత సాధారణ రకం ఎరుపు. రాస్ప్బెర్రీస్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును ప్రోత్సహిస్తుంది. రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందమైన చర్మాన్ని కూడా పొందవచ్చు.

మానసిక స్థితి మరియు జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది: కోరిందకాయలను తీసుకోవడం వల్ల మెదడు దెబ్బతినడం,వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. ఇది సాధారణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఇతర వృద్ధాప్య పరిస్థితులపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.

కోరిందకాయలలోని ఆంథోసైనిన్, అధిక ఫైబర్ కంటెంట్ రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. రాస్ప్బెర్రీస్ విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్లు జుట్టుకు చాలా ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. మెటిమలు తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాల మూలం రాస్ప్బెర్రీస్..ఒమేగా- 3,ఒమేగా- 6 కొవ్వు ఆమ్లాల మూలం. ఇవి జుట్టు, చర్మం, గోళ్ళకు బాగా ఉపయోగపడతాయి. తామర, రోసేసియా, సోరియాసిస్‌కు వంటివి రాకుండా నివారిస్తుంది. శరీర కణజాలాలను రిఫ్రెష్ చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి