Pumpkin Seeds: అందమైన జుట్టు కోసం గుమ్మడి గింజలు.. ఇలా ట్రై చేస్తే అద్భుత ఫలితాలు..!

|

May 23, 2022 | 8:37 PM

Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలం. మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Pumpkin Seeds: అందమైన జుట్టు కోసం గుమ్మడి గింజలు.. ఇలా ట్రై చేస్తే అద్భుత ఫలితాలు..!
Pumpkin Seeds
Follow us on

Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలం. మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు పల్చబడటం, చుండ్రు, చిట్లిన జుట్టు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది నిర్జీవంగా, పొడిగా మారిన జుట్టును మృదువుగా చేస్తుంది. మీరు వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అనేక విధాలుగా తినవచ్చు. నీళ్లలో నానబెట్టి, వేయించి, సలాడ్‌లలో, వేసుకుని తినవచ్చు. గుమ్మడి గింజల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పొడవాటి జుట్టు కోసం

గుమ్మడి గింజలు జుట్టుని పెరిగేలా చేస్తాయి. ఇది జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. వీటిని ప్రతిరోజూ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఈ గింజల్లో ఉండే పోషకాలు మీ జుట్టుకు అధిక పోషణనిస్తాయి.

ఇవి కూడా చదవండి

చుండ్రు సమస్యను ఎదుర్కోవడానికి

కొన్నిసార్లు చుండ్రు వదిలించుకోవటం చాలా కష్టం అవుతుంది. చుండ్రు సమస్య వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ సందర్భంలో మీరు గుమ్మడి విత్తనాలను ఉపయోగించవచ్చు. దీని కోసం గుమ్మడి గింజల పేస్ట్‌లో నిమ్మరసం కలపండి. దీన్ని తలకు పట్టించాలి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఇది దురద, మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చిట్లిన జుట్టుకి ప్రయోజనకరంగా ఉంటుంది

జుట్టు చిట్లడం వల్ల రాలడం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో జుట్టు బలహీనంగా మారుతుంది. మృదువైన జుట్టు కోసం గుమ్మడికాయ గింజలను ఉపయోగించవచ్చు. దీని కోసం 1 నుంచి 2 గుమ్మడి గింజల పేస్ట్‌లో పెరుగు, తేనె కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడగాలి. ఇది శిరోజాలను చల్లబరుస్తుంది. మూలాల నుంచి జుట్టును బలంగా మార్చుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి