AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే.. పొరపాటున కూడా ఈ 4 ఆహారాలు తినొద్దు

భారతదేశంలో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది.. పెద్ద సంఖ్యలో ప్రజలు దీనికి బలైపోతున్నారు. మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.. దాని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం.. ఈ ప్రక్రియ జరిగినప్పుడు కాల్షియం, సోడియం, అనేక రకాల ఖనిజాల కణాలు మూత్ర నాళం ద్వారా మూత్రాశయానికి చేరుతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే.. పొరపాటున కూడా ఈ 4 ఆహారాలు తినొద్దు
Kidney Stones Diet Tips
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2025 | 5:25 PM

Share

భారతదేశంలో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది.. పెద్ద సంఖ్యలో ప్రజలు దీనికి బలైపోతున్నారు. మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.. దాని ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం.. ఈ ప్రక్రియ జరిగినప్పుడు కాల్షియం, సోడియం, అనేక రకాల ఖనిజాల కణాలు మూత్ర నాళం ద్వారా మూత్రాశయానికి చేరుతాయి. ఈ వస్తువుల పరిమాణం పెరగడం ప్రారంభమైన తరువాత అవి ఘనీభవించి రాయి ఆకారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాయి.. దీనిని రాళ్లుగా పిలుస్తారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే కిడ్నీల్లో రాళ్ల ప్రమాదం మరింత పెరిగి.. అత్యవసర పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు.. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, నడుము ప్రాంతంలో నొప్పి.. వికారం గురించి ఫిర్యాదు చేస్తారు.. అటువంటి పరిస్థితిలో అలాంటి వారు.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం..

డైటీషియన్‌ల ప్రకారం.. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేకపోతే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.

మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే వీటిని తినకండి..

విటమిన్ సి ఆధారిత ఆహారాలు: రాళ్ల సమస్య ఉన్నట్లయితే, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా మరిన్ని రాళ్ళు ఏర్పడటం ప్రారంభిస్తాయి. నిమ్మ, పాలకూర, నారింజ, ఆవాలు, కివి, జామ వంటి వాటిని తినడం మానేయడం మంచిది.

శీతల పానీయాలు – టీ-కాఫీ: మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు.. అలాంటి సందర్భంలో కెఫిన్ శరీరానికి హానికరం కావచ్చు. అందువల్ల, శీతల పానీయాలు, టీ-కాఫీలు కిడ్నీల్లో రాళ్లు ఉన్న రోగులకు విషం కంటే తక్కువ కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉప్పు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉప్పు, అత్యధిక ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది.. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

మాంసాహారం: మాంసం, చేపలు, గుడ్లు.. కూడా కిడ్నీలో రాళ్లు ఉన్న రోగులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.. ఈ పోషకం శరీరానికి ఎంత ముఖ్యమైనదైనా, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవడం, వైద్యం పొందడం ముఖ్యం.. అలానే వైద్యులు చెప్పిన విధంగా ఆహారాలను తీసుకోవాలి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం