Pregnant Care: మీ ఈ ఒక్క అలవాటు గర్భధారణ సమయంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది.. అదేంటంటే..!

|

Apr 09, 2022 | 10:07 PM

Pregnant Care: గర్భధారణ సమయంలో శరీరంలో హోర్మోన్లలో మార్పులు వస్తాయి. ఈ మార్పుల కారణంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటుటారు

Pregnant Care: మీ ఈ ఒక్క అలవాటు గర్భధారణ సమయంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది.. అదేంటంటే..!
Women Health
Follow us on

Pregnant Care: గర్భధారణ సమయంలో శరీరంలో హోర్మోన్లలో మార్పులు వస్తాయి. ఈ మార్పుల కారణంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటుటారు. ఆ సమస్యలలో ఒత్తిడి ముఖ్యమైనది. కొంత మంది స్త్రీలు గర్భిణీగా ఉన్న సమయంలో ఎక్కువగా ఆలోచించి.. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అలా తమకు తాముగా మరిన్ని సమస్యలను కొనితెచ్చుకుంటారు. దీని కారణంగా మహిళలకు హై బీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఈ హై బీపీ గర్భిణీ స్త్రీలకే కాకుండా.. కడుపులోని పిల్లలకు కూడా హానీకరం. ఇది ప్రీ డెలివరీ(నెలలు నిండక ముందే డెలివరీ అవడం), గర్భస్రావం అవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారి మెదడు అభివృద్ధి దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే.. గర్భిణిగా ఉన్న సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి మానసిక ఒత్తిడిని నివారించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో ఒత్తిడిని నివారించడానికి మార్గాలు..
1. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక చంచలత్వాన్ని తగ్గిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళలలో నిశ్శబ్ధ ప్రాంతంలో కూర్చుని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
2. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక హాబీ ఉంటుంది. పెళ్లయ్యాక బాధ్యతల వల్ల చాలా మంది మహిళలు ఆ హాబీలను విస్మరిస్తుంటారు. అయితే, కొత్త ప్రయోగాలు, కొత్త అభిరుచులను నేరవేర్చుకోవడానికి గర్భధారణ సమయం ఉత్తమమైనది. ఈ కాలంలో పాడటం, స్కెచింగ్, పెయింటింగ్, రాయడం వంటి ఇష్టమైన పనులు చేస్తే.. నూతన ఉత్తేజం జనిస్తుంది. మనసులోని ప్రతికూల అంశాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు.
3. కొన్నిసార్లు ఇంట్లో కొన్ని విషయాలు ఒత్తిడికి గురి చేస్తాయి. కొంతమంది స్త్రీలు నిరంతరం వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటారు. ఫలితంగా టెన్షన్ పెరుగుతుంది. అలాంటి సందర్భంలో.. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు.. మీకు ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నవారితో మీ మనసులోని విషయాలను పంచుకోండి. అలా సమస్యలను ఒకరితో షేర్ చేసుకోవడం ద్వారా మనస్సు తేలికపడుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
4. చదవడం ఇష్టం ఉంటే.. పుస్తకాలు చదవడానికి మించిన మంచి పని మరోటి లేదు. ఈ హాబీని మరింత పెంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసు పనికిరాని విషయాల నుంచి డైవర్ట్ అయి.. మంచి విషయాలపై మల్లుతుంది. పుస్తకాలు చదవడం వల్ల పిల్లల ఐక్యూ స్థాయి కూడా మెరుగుపడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, మీలో సానుకూల దృక్పథాన్ని పెంచే పుస్తకాలు మాత్రమే చదవాలిన నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: పైని పేర్కొన్న సలహాలు, సూచనలు నిపుణులు తెలిపినవి. వీటిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. గర్భధారణ సమయంలో ఏవైనా సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమం.)

Also read:

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!