Diabetes: పెళ్లికి, మధుమేహానికి లింక్ ఉందంటే మీరు నమ్ముతారా.. పరిశోధనల్లో తేలిన ఆసక్తికర విషయాలు..

భాగస్వామితో కలిసి జీవించడవల్ల రక్తంలో చక్కెరస్థాయిలను కంట్రోల్ చేయడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గింవచ్చని పరిశోధకులు అంటున్నారు.

Diabetes: పెళ్లికి, మధుమేహానికి లింక్ ఉందంటే మీరు నమ్ముతారా.. పరిశోధనల్లో తేలిన ఆసక్తికర విషయాలు..
Type 2 Diabetes

Edited By: Janardhan Veluru

Updated on: Feb 10, 2023 | 1:38 PM

డయాబెటిస్..ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఇండియాలోనూ చాలామంది దీని బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది అంత్యంత ప్రమాదకరమైన కానప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఇది ప్రాణాల మీదకు వస్తుంది. మధుమేహం బారినపడకుండా ఉండాలంటే క్రమంతప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

డయాబెటిస్‎లో రెండు రకాలు ఉంటాయి.టైప్ -1 డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్‎లో శక్తికోసం కణాలలోకి గ్లూకోజ్‎ను తరలించే ప్రక్రియకు తోడ్పడే ఇన్సులిన్‎ను శరీరం తయారు చేసుకోలేదు. టైప్ 2 డయాబెటిస్ లో ఒక వ్యక్తి శరీరం ఇన్సులిన్‎ను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇది కాలక్రమేణా శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ తయారు చేయదు. టైప్ 1 డయాబెటిస్‎ను నివారించలేము కానీ టైప్ 2 డయాబెటిస్‎ను కంట్రోల్ చేయవచ్చు. అయితే మధుమేహం రాకుండా నివారించడంలో మీ భాగస్వామికి సహాయపడతారన్న విషయం మీకు తెలుసా? అవును వైవాహిక సంబంధంలో సంతోషంగా ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. ఇది మేము చెబుతున్నది కాదు తాజా  అధ్యయనాలు చెబుతున్నాయి.

లక్సెంబర్గ్ యూనివర్సిటీ, కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించారు. భాగస్వామితో మీ సంబంధం సంతోషం ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని ఈ పరిశోధనా  బృందం వెల్లడించింది. ఒంటరిగా నివసిస్తున్నవారితోపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న కొంతమందిపై అధ్యయనం చేశారు. గ్లైసెమిక్ స్థాయిలు వైవాహిక సంబంధంతో ముడిపడి ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో ఆంగ్లలాగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్ (ELSA)నుంచి బయోమార్కర్ సమాచారాన్ని ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

HbAlc  స్థాయిని కొలిచేందుకు 50 నుంచి 89ఏళ్ల వయస్సు మధ్య ఉన్న 3,335 మంది నుంచి డేటా సేకరించారు. సగటు గ్లైసెమిక్ లేదా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను కొలించేందుకు వారి నుంచి రక్త నమూనాలను తీసుకున్నారు. వీరిలో భర్త, భార్య లేదా భాగస్వామి ఉన్నారా లేదా ఒత్తిడికి లోనవుతున్నారా అనే ప్రశ్నలు అడిగారు. వయస్సు, ఆదాయం, ఉద్యోగం, ధూమపానం, శారీరకంగా చురకుగా ఉండటం, నిరాశ, బాడిమాస్ ఇండెక్స్, సోషల్ నెట్ వర్క్ వంటి ఇతర సామాజిక సంబంధాలు కలిగి ఉండటం వంటి అంశాల గురించి వారినుంచి డేటా సేరించారు.

అంతేకాదు ఈ అధ్యయనం ప్రీడయాబెటిస్ అసమానతలను కూడా పరీక్షించింది. వివాహ జీవితంలో సంతోషంగా ఉన్నవారిలో సహజీవనం చేసేవారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్  తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాలక్రమేణా వారి సంబంధాలు బెడిసి కొట్టినా,విడాకులు తీసుకున్నవారి రక్తంలో చక్కెరస్థాయిలలో ప్రీడయాబెటిస్ అసమానతలలో గణనీయమైన మార్పులను చూశారు. వైవాహిక సంబంధంలో సరిగ్గా లేకున్నా ఒత్తిడితో జీవిస్తున్నా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

మొత్తానికి భాగస్వామితో కలిసి జీవించడవల్ల రక్తంలో చక్కెరస్థాయిలను కంట్రోల్ చేయడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గింవచ్చని పరిశోధకులు గుర్తించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..