ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ప్రముఖ సింగర్ మృతి.. ఆ సమస్య లక్షణాలివే..

నేటి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్యాన్సర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ గజల్ సంగీత విద్వాంసుడు 72 ఏళ్ళ వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించారు. ఇది మగవారిలో వచ్చే అతి భయంకరమైన క్యాన్సర్స్‌లో ఒకటి. ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ప్రముఖ సింగర్ మృతి.. ఆ సమస్య లక్షణాలివే..
Pancreatic Cancer

Updated on: Feb 29, 2024 | 1:37 PM

ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ గజల్ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పంకజ్ ఉదాస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత, ఈ రకమైన క్యాన్సర్ పట్ల ప్రజలు చాలా ప్రశ్నలను నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే, దాని లక్షణాలు మొదట్లో తెలియవు. ఒక్కోసారి మృత్యువు అంచుకు చేరినప్పుడే వ్యాధి బయట పడుతుంది. పురుషుల శరీరంలో పెరిగే కణితులన్నీ ప్రాణాంతకమైనవి కావు. అసాయం చేయని కణితులు కూడా పెద్దవిగా పెరుగుతాయి. వాటి వల్ల శరీరంలోని ఇతర భాగాలకు ఇబ్బంది ఉండదు. కానీ ప్రాణాంతక క్యాన్సర్ కణితులు సమీపంలోని కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి. 

మరణానికి 2-3 నెలల ముందు వరకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు పంకజ్ ఉదాస్. చివరి దశలో ఆయన తనకు క్యాన్సర్ ఉందని తెలుసుకోవడంతో.. దానిపై పోరాడేందుకు సమయం దొరకలేదు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్.  ప్యాంక్రియాస్ మన శరీరానికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో రహస్య ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మంచి జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడతాయి. డయాబెటిస్ నియంత్రణకు హార్మోన్లను కలిగి ఉంటాయి.  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సాధారణంగా ప్రారంభ దశలో గుర్తించడం అంత సులభం కాదు. మాయో క్లినిక్ ప్రకారం, ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించే వరకు సంకేతాలు, లక్షణాలు కనిపించకపోవచ్చు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు:

– ఆకలిగా ఉండదు

– అకస్మాత్తుగా బరువు తగ్గడం

– ముదురు రంగు మూత్రం

– దురద

– నియంత్రణ లేని మధుమేహం

– కడుపు నొప్పి. పొత్తికడుపు పైభాగంలో వస్తుంది. 

– అవయవాలలో నొప్పి

–  ఎప్పుడూ అలసటగా ఉండటం

– కళ్ళు పచ్చగా మారడం..

– చాలా మందికి మలం రంగులోనూ తేడా కనిపిస్తుంది. నల్లగా, ఇలా రంగు తేడాగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది

కుటుంబ  పరంగా కూడా  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెప్తున్నాయి. అధిక మద్యపానం, దుర్బర జీవనశైలి, ఊబకాయం… కూడా క్యాన్సర్ రావడానికి ఇతర ప్రమాద కారకాలు.  స్థూలకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నియంత్రించుకోవడానికి ఆరోగ్యకరమైన బరువు ఉండటం చాలా ముఖ్యం.

((NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..