Pani Puri Side Effects: వర్షాకాలం వచ్చిందంటే చాలు అంతుచిక్కని రోగాలు మనుషులను వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో టైఫాయిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్యాధికారులు కీలక ప్రకటన చేశారు. టైఫాయిడ్ కేసుల పెరుగుదలకు పానీపూరి కారణం అని ప్రకటించారు. అందులో వాడే పదార్థాలు టైఫాయిడ్ వంటి రోగాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టైఫాయిడ్‌కు పానీపూరి వ్యాధిగా పేరు పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పానీపూరి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం..
1. పానీపూరి తినడం వల్ల శరీరంలో టైఫాయిడ్ మాత్రమే కాదు అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో పానీపూరి తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
2. పానీపూరి ఎక్కువగా తినడం వల్ల అతిసారం సమస్య వస్తుంది.
3. పానీపూరి ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
4. వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఉంది.
5. పానీ పూరీ వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
6. ఎక్కువ పానీపూరి నీరు వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
7. ప్రేగులలో మంటలు వస్తాయి.
8. ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి తినకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..