మధుమేహం రోగాన్ని శాశ్వతంగా నివారించలేం కానీ రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు హెల్దీఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ, వ్యాయామాలు చేయడం తదితర అలవాట్లతో రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పనీర్ కూడా ఒకటి. పనీర్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పనీర్ చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. డయాబెటిక్ పేషెంట్లు పగలు లేదా రాత్రి భోజనంలో పనీర్ తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్‌తో తయారుచేసిన పనీర్ బ్లడ్ షుగర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు రోజులో 80 నుంచి 100 గ్రాముల పనీర్ తీసుకుంటే సరిపోతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
పనీర్‌లో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లకు పనీర్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పనీర్‌ను పచ్చిగానైనా లేదా వండిన రూపంలో తీసుకోవచ్చు. పచ్చి పనీర్‌లో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది షుగర్ రోగులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది . ఇది కాకుండా, పనీర్‌ను ప్రత్యేక వంటకంగా కూడా తినవచ్చు. కూరగాయలతో కలిపి సలాడ్లు, లేదా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. టీవీ9 ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్రువీకరించదు. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..