Oral Cancer: మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే..!

|

Feb 25, 2023 | 4:15 PM

నోటి క్యాన్సర్‌ను సూచిస్తూ కొన్ని లక్షణాలు మనకు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యాధి అయినా ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స అందించడం సులువ అవుతుందని చెబుతున్నారు.

Oral Cancer: మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే..!
Oral Cancer
Follow us on

ప్రతి పెద్ద ఆరోగ్య సమస్యకు మన శరీరం ముందు నుంచే కొన్ని సూచనలు ఇస్తుంది. వాటిని సకాలంలో గమనించి సరైన చికిత్స తీసుకుంటే సమస్య పెద్దది అవ్వకుండా ఆదిలోని అంతం చేయవచ్చు. కానీ ప్రస్తుతం ఆ సూచనలు పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ప్రస్తుతం మన శరీరంలోని నోటిలో కనిపించే కొన్ని సూచనలు ఏంటో  ఓ సారి చూద్దాం. ఎందుకంటే నోటి క్యాన్సర్‌ను సూచిస్తూ కొన్ని లక్షణాలు మనకు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యాధి అయినా ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స అందించడం సులువ అవుతుందని చెబుతున్నారు. అలాగే ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పొగాకు వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారతీయులకు చాలా ఎక్కువగా ఉంటాయి. గుట్కా, జర్ధా, ఖైనీ, వంటివి కొంతమంది అధికంగా వాడతారు. వారుకచ్చితంగా నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంది. నోటి క్యాన్సర్ విషయంలో మన నోటిలో కనిపించే సూచినలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

నోటి ప్యాచెస్

చిగుళ్లు, నాలు, టాన్సిల్ లేదా నోటి లైనింగ్‌పై ఎరుపు లేదా తెలుపుగా ఉండే మందపాటి ప్యాచెస్ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ల్యూకోప్లాకియా అంటారు. ల్యూకోపాకియాను చాలా మంది క్యాన్సర్ ప్రారంభ సంకేతంగా చూస్తారు. పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. 

వివరించలేని గడ్డలు

నోటిలో లేదా శోషరస గ్రంధుల్లో వివరించలేని గడ్డలు క్యాన్సర్‌ను సూచిస్తాయి. గొంతులో ఏదో చిక్కుకున్నట్లు లేదా నిరంతరం గొంతు నొప్పిని అనుభవిస్తే వెంటనే ఈఎన్‌టీ ద్వారా వైద్యసాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

ముఖంపై తిమ్మిర్లు

ఎలాంటి కారణం లేకుండా ముఖం, నోరు లేదా మెడ ప్రాంతాల్లో తిమ్మిరి, నొప్పి లేదా సున్నితత్వం నోటి క్యాన్సర్‌కు సంకేంతంగా చూడాలి. ముఖ్యంగా దవడలో వాపు లేదా నొప్పి వచ్చినా అనుమానించడం ఉత్తమం. ఒకవేళ్ల మీకు కట్టుడుపళ్లు ఉంటే ఆ ప్రాంతంలో అసౌకర్యంగా ఉన్నా నోటి క్యాన్సర్‌కు కారణం కావచ్చు. 

దంతాలు ఊడిపోవడం

ఒక్కసారిగా ఎలాంటి నొప్పి లేకుండా ఒకటి కంటే ఎక్కువగా దంతాలు ఊడిపోయినా లేదా వదులుగా మారినా క్యాన్సర్ సంకేతంగా గుర్తించాలి. అయితే కట్టుడు పళ్ల మధ్య అసౌకర్యంగా కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 

నోటి క్యాన్సర్ చికిత్స

వివిధ పరీక్షల అనంతరం నోటి క్యాన్సర్ నిర్ధారణ అయితే క్యాన్సర్ దశ, రకం, బాధితుడి ఆరోగ్యం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని వైద్యులు చికిత్సను ప్రారంభిస్తారు. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడానికి శస్త్ర చికిత్స, రేడియేషన్, కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్స ఎంపికలు చాలా ఉన్నాయి.

మరిన్ని హెల్త్‌/లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.