ఆ టీకా తీసుకుంటే ప్రాణాలతో బయట పడినట్లే.. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..

| Edited By: Team Veegam

May 12, 2021 | 11:22 PM

AstraZeneca Vaccine: కరోనా నుంచి రక్షించేందుకు ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు సంజీవనిలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(PHE ) వెల్లడించింది.  కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే..

ఆ టీకా తీసుకుంటే ప్రాణాలతో బయట పడినట్లే.. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
Covishield
Follow us on

కరోనా నుంచి రక్షించేందుకు ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు సంజీవనిలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(PHE ) వెల్లడించింది.  కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే.. 80 శాతం వరకు మరణం నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు, రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు ప్రాణాలు కాపాడుతుందని పేర్కొంది.

డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది, ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని తెలిపింది.

కోవిడ్ బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన తాజా అధ్యయనంలో స్పషం చేసింది. ఇక ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కోవిడ్ వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా.. మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ తెలిపింది.

ఇవి కూడా చదవండి :  Viral News: వీడు మామూలోడు కాదు.. ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు.. వైరల్ ట్వీట్..

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..