
ప్రమాదాలకు గురైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎందుకంటే వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. అయితే ఇలాంటి వారిని భయపెడుతూ మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. శరీరంలోని మాంసాన్ని తినే ఓ కొత్త బ్యాక్టిరియా వల్ల ఇటీవల ఫ్లోరిడాలోని ఓ 11 ఏళ్ల బాబు చనిపోవడంతో సంచలనం సృష్టించింది. చీలమండలో బెణుకు కారణంగా అతను అరుదైన గ్రూప్-ఏ స్ట్రెప్ బ్యాక్టిరియా బారిన పడ్డాడు. అనంతరం అది నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌గా మారింది. ఇది ముఖ్యంగా శరీర కణజాలంపై దాడి చేసే అరుదైన బ్యాక్టిరియా వ్యాధి. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత బాలుడి కాలు ఎరుపు రంగులోకి మారింది. అది గ్రూప్ స్ట్రెప్-కు సంకేతమని గుర్తించి, ఆస్పత్రిలో చేర్చారు. అయితే వ్యాధి ఇంకా తీవ్రమై శరీర అవయవాలపై ప్రభావం పడి చనిపోయాడు.
గ్రూప్ A స్ట్రెప్ అనేది స్ట్రెప్ థ్రోట్, స్కార్లెట్ ఫీవర్, నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌తో సహా అనేక ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా. ఇది ఒక ఇన్వాసివ్ వ్యాధి, అంటే సూక్ష్మక్రిములు సాధారణంగా సూక్ష్మక్రిములు లేని శరీర భాగాలపై దాడి చేస్తాయి. ఇది జరిగినప్పుడు, వ్యాధి సాధారణంగా చాలా తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అనేది శరీరంలో చాలా వేగంగా వ్యాపించే అరుదైన ప్రాణాంతక బాక్టీరియా సంక్రమణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు కారణమయ్యే బ్యాక్టిరియాలు చాలా ఉన్నాయి. ఏదైనా గాయం, కోతలు, కాలిన గాయాలు, కీటకాలు కాటు, శస్త్రచికిత్స గాయాల కారణంగా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఈ బ్యాక్టిరియా సోకిన ప్రాంతంలో చర్మం ఎర్రగా మారుతుంది. ఆ ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి చర్మంపై పొక్కులు రావడంతో పాటు చర్మం నల్లగా మారుతుంది. తల తిరగడం, అలసట, అతిసారం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ వ్యాధి నుంచి రక్షణకు ఎలాంటి చికిత్స లేదు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగిన సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు దెబ్బతగిలిన ప్రాంతాన్ని శుభ్రపర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..