Cancer Risk: ఈ ఎనిమిది సూత్రాలతో క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టొచ్చు.. ఇప్పుడే మేల్కొండి..
క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది చనిపోతున్నారు. ట్రీట్మెంట్ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కడం లేదు. అయితే.. క్యాన్సర్ మహమ్మారిని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవచ్చు.. కానీ చివరి దశలో గుర్తించడం వల్ల చాలామంది చనిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది చనిపోతున్నారు. ట్రీట్మెంట్ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కడం లేదు. అయితే.. క్యాన్సర్ మహమ్మారిని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవచ్చు.. కానీ చివరి దశలో గుర్తించడం వల్ల చాలామంది చనిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ జబ్బు వచ్చిన తర్వాత గుర్తించడం కంటే కూడా కొన్ని నియమాలు పాటిస్తే క్యాన్సర్ బారిన మనం పడకుండా ఉండొచ్చని.. కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
8 సూత్రాలతో క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చుని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. ఈ ఎనిమిది సూత్రాలను రెగ్యులర్ గా పాటిస్తే ప్రతి ఇద్దరిలో ఒకరిని క్యాన్సర్ నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. దీనికోసం 8 సూత్రాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచిస్తుంది.
క్యాన్సర్ రాకుండా ఉండడానికి ధూమపానానికి దూరంగా ఉండటం చాలా బెటర్ అని సూచిస్తున్నారు. ఈ కారణంగా దాదాపు 16 రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉందని.. ఊపిరితిత్తులు పెద్ద పేగు క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయని వారు గుర్తించారు.
బరువు పెరగడం క్యాన్సర్ కి ఒక కారణంగా మారింది. కొవ్వు అధికంగా చేరటం రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్లో మార్పుతో అండాశయ క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉన్నది.మహిళల్లో 11% కేసులు పురుషుల్లో ఐదు శాతం కేసులు ఈ స్థూలకాయం వల్లే. బరువు పెరగడానికి దూరంగా ఉండడం మరో చిట్కా.
క్యాన్సర్ కారకానికి మద్యపానం మరొక కారణంగా చెప్పొచ్చు. క్యాన్సర్ వచ్చే కొత్త కేసుల్లో 5.5% మరణాల్లో 5.8% మధ్యాహ్నం కారణమే మద్యం సేవించడం వల్ల కాలేయంతో పాటు డీఎన్ఏ కణాలు నాశనం అవుతాయి. దీంతో అనేక రకాల క్యాన్సర్ బారిన పడతాం. కావున మద్యపానానికి దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు.
ప్రాసెస్ మాంసం అసలుకే మోసం అంటున్నారు.. మాంసం నిల్వ ఉంచడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు. ఇవి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అలాంటి ప్రాసెస్ చేసిన ఫుడ్ కు దూరంగా ఉండటం అందరికీ మంచిదని సలహా ఇస్తున్నారు.
క్యాన్సర్ కి దూరంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకు పచ్చని కూరగాయలు, తాజా పండ్లు మంచి ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దని సొసైటీ సూచనలు చేస్తుంది. పోషకాలు అందకపోవడంతో ఇమ్యూనిటీ తగ్గి క్యాన్సర్ కణాల అభివృద్ధికి కారణం కావచ్చు అని అందుకే మంచి ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు.
ఇంకా ప్రతిరోజు శరీరానికి మనిషికి వ్యాయామం అవసరమని చురుగ్గా ఉండడానికి యోగ వంటి సాధనాలు తప్పనిసరి అని అంటున్నారు. క్యాన్సర్ కట్టడికి ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
యూవీ రేడియేషన్ కారణంగా చర్మ కణాల్లోని డిఎన్ఏ నాశనం అవుతుంది. ఇది చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు. అందుకే ఇవి రేడియేషన్ తగిలే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు.
దాదాపు సగం క్యాన్సర్ కేసులు వీటివల్లే వస్తున్నాయని.. కావున లైఫ్ స్టైల్ ను ఛేంజ్ చేసుకుంటే క్యాన్సర్ ప్రమాదం, మరణాల నుంచి బయటపడొచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..