Mustard Seeds: నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. అవాల ఉపయోగం ఏంటో తెలిస్తే షాకవుతారు!

ఆయుర్వేదంలో ఆవాల వాడకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇది జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలు, నొప్పి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ఆవాలలో ఉండే పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, సోరియాసిస్ చికిత్సలో దీన్ని..

Mustard Seeds: నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. అవాల ఉపయోగం ఏంటో తెలిస్తే షాకవుతారు!
Mustard Seeds

Updated on: Aug 11, 2024 | 7:42 AM

ఆయుర్వేదంలో ఆవాల వాడకానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇది జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలు, నొప్పి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. ఆవాలలో ఉండే పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, సోరియాసిస్ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

పంటి నొప్పిని త్వరగా తగ్గిస్తుంది:

రోజూ ఆహారంలో ఆవాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయంటున్నారు నిపుణులు. ఆవాలు రోజూ తినేవారిలో దంతాల సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పంటి నొప్పితో బాధపడేవారు ఆవాలు నీళ్లలో మరిగించి తాగడం లేదా పుక్కిలించడం వల్ల పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. ఆవాల పొడిని గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతుంది.

కీళ్ల నొప్పుల కోసం ఆవపిండిని ఉపయోగించండిలా..

కొంతమందికి కీళ్ల నొప్పులు వస్తాయి. మరి కొందరు నడవలేరు. వారు ఆవాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఒక టీస్పూన్ ఆవాల పొడి, కర్పూరం కలపండి. మెత్తగా పొడి చేయండి. కొంచెం నీళ్లతో పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి. ఇలా చేయడం వల్ల నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది.

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:

ఆవపిండిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అవి కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడటానికి శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది జీర్ణ సమస్యలను త్వరగా తగ్గిస్తుంది. అలాగే బరువును తగ్గిస్తుంది. మీరు ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే, ఒక చెంచా ఆవాల పొడిని నీటిలో కలిపి తాగండి. ఇలా చేయడం వల్ల కడుపులోని విషపూరితమైన ఆహారం వాంతి రూపంలో బయటకు వస్తుంది. ఆ తర్వాత పొట్ట రిలాక్స్‌గా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)