Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నేచురల్‌ టిప్స్‌తో ఉపశమనం పొందండి

|

Sep 25, 2022 | 11:26 AM

Health Tips: పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యల్లో నోటిపూత (Mouth Ulcers) కూడా ఒకటి. ఇదొక్కటే కాదు..కొన్నిసార్లు పొట్ట శుభ్రంగా లేకున్నా, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినా మౌత్‌ అల్సర్స్‌ ఇబ్బంది పెడతాయి.

Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నేచురల్‌ టిప్స్‌తో ఉపశమనం పొందండి
Mouth Ulcer
Follow us on

Health Tips: పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యల్లో నోటిపూత (Mouth Ulcers) కూడా ఒకటి. ఇదొక్కటే కాదు..కొన్నిసార్లు పొట్ట శుభ్రంగా లేకున్నా, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినా మౌత్‌ అల్సర్స్‌ ఇబ్బంది పెడతాయి. అలాగే అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్ వంటివన్నీ నోటిపూతకు కారణాలే. ఈ సమస్య తలెత్తినప్పుడు తినడం, తాగడం చాలా కష్టమవుతుంది. కాగా పెదవుల లోపల హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల ఏర్పడే పొక్కులు క్రమంగా పుండ్లుగా మారుతాయి. ఇవి ఎర్రగా మారి తెగ ఇబ్బంది పెడతాయి. కాగా నోటి పూతలకు సరైన చికిత్స అవసరం. లేకపోతే సమస్య మరింత జఠిలంగా మారుతుంది. అయితే మౌత్‌ అల్సర్లు తలెత్తినప్పుడల్లా వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతోనూ ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీబయాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల అల్సర్లను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నోటి పొక్కులపై మెత్తగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.

టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నోటి అల్సర్లను నయం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు టీ ట్రీ ఆయిల్‌ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యి 
దేశీ నెయ్యిని ఉపయోగించడం వల్ల నోటిపూత తగ్గుతుంది. నెయ్యి అల్సర్‌లకు ఇది చాలా మేలు చేస్తుంది. ఇది వాడిన కొద్ది రోజుల్లోనే అల్సర్‌లను పూర్తిగా నయమవుతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు నోటి పొక్కులపై దేశీ నెయ్యి రాసి, ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి.

తేనె
యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన తేనె బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. అందువలన, ఇది మీ నోటి అల్సర్ సమస్యకు మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. నోటి పుండు మీద నెయ్యి రాస్తే రెండు రోజుల్లో పుండు క్రమంగా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..