Mosquitoes: ఇంట్లో దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలతో చక్కని పరిష్కారం..

|

Sep 11, 2022 | 8:35 PM

వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి ప్రబలుతాయి. ఈ సీజన్‌లో ఏటా దోమల బెడద కూడా పెరుగుతోంది.

Mosquitoes: ఇంట్లో దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలతో చక్కని పరిష్కారం..
Mosquitoes
Follow us on

Mosquitoes Home Remedies: రుతుపవనాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి ప్రబలుతాయి. ఈ సీజన్‌లో ఏటా దోమల బెడద కూడా పెరుగుతోంది. మీరు కూడా దోమలతో ఇబ్బంది పడుతుంటే.. చింతించకండి. ఇంట్లో నుంచి దోమలను వెంటనే బయటకు తరిమివేసే హోం రెమిడిస్ ను ఈ రోజు చెప్పబోతున్నాం.. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆ ఇంటి నివారణ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గదిలో కర్పూరం ఉంచండి..

దోమలు, కీటకాలను తరిమికొట్టడానికి కర్పూరం ఉత్తమ నివారణగా పరిగణిస్తారు. మీరు కూడా దోమల వ్యాప్తితో ఇబ్బంది పడుతుంటే 2-3 కర్పూరం బిళ్లలను కాల్చి గదిలో ఉంచండి. దీని తరువాత కాసేపు గది తలుపులను మూసివేయండి. కర్పూరం వాసన గది మొత్తం నిండిన తర్వాత తలుపు తెరవండి. కర్పూరం వాసనతో దోమలు బయటకు పోతాయి.

ఇవి కూడా చదవండి

పచ్చి వేప ఆకుల పొగ..

వేపను ఉత్తమ ఆయుర్వేద మొక్కగా పరిగణిస్తారు. మీరు కూడా దోమలతో ఇబ్బందులు పడుతుంటే పచ్చి వేప ఆకుల సాయం తీసుకోండి. పచ్చి వేప ఆకులు కాల్చకుండా.. పొగ వచ్చేలా మంటను వెలిగించాలి. ఇలా చేస్తే పొగతో దోమలు పోతాయి. ఇంకా దోమ కాటును నివారించడానికి మీరు వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి పేస్ట్..

వెల్లుల్లి సువాసన కొంచెం ఘాటుగా ఉంటుంది. దీనిని దోమలు తట్టుకోలేవు. సాధారణంగా వెల్లుల్లి పెస్ట్ తో దోమలను నివారించవచ్చు. వెల్లుల్లి పేస్ట్ ను ద్రవణంలా తయారు చేసి.. ఇంటి అన్ని మూలల్లో చల్లుకోండి. ఇలా చేస్తే.. వెల్లుల్లి ఘాటుకి దోమలు బయటకు పోతాయి.

పుదీనా రసం..

పుదీనాలో ఆయుర్వేద గుణాలు దాగున్నాయి. పుదీనా కూడా దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పుదీనా రసం లేదా నూనె తీసుకోండి. ఈ రసాన్ని ఇంటి మూలలన్నింటిలో కొద్దికొద్దిగా చల్లుకోండి. ఈ వాసన వల్ల దోమలు ఎక్కువసేపు ఉండలేవు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..