Mobile Using Effects: మొబైల్ ఫోన్ వాడటం వల్ల క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.. మొబైల్ ఫోన్ వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.. మొబైల్ ఫోన్ ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.. ఇలాంటి వార్తలు రోజూ కొకొల్లుగా చూస్తుంటాం. సోషల్ మీడియాలోనూ మొబైల్ ఫోన్ వల్ల నష్టాలు ఎక్కువంటూ వేలాది పోస్టులు నిత్యం వస్తూనే ఉంటాయి. మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ కారణమవుతుందంటూ తాజాగా ఒక పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియానే కాదు.. పరిశోధకులను కూడా ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలోనే మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిల్ ట్యూమర్ వస్తుందా? ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కీలక అంశాలను తేల్చారు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ రాదని పరిశోధకులు తేల్చారు.
మొబైల్ వినియోగం, బ్రెయిన్ క్యాన్సర్ రావడానికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు UKలోని 4 లక్షల మందిపై పరిశోధన చేశారు. దాదాపు ఒక దశాబ్దం పాటు వారిని ట్రాక్ చేశారు. పరిశోధనలో చేర్చబడిన 4 లక్షల మందిలో మహిళలు 50 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కూడా ఉన్నారు. ఈ పరిశోధన 2001 – 2011 మధ్య జరిగింది. ఈ మహిళలు ఫోన్‌ను ఎప్పుడు, ఎంతమేరకు ఉపయోగిస్తున్నారు అనే సమాచారాన్ని తీసుకున్నారు. వారి సమాధానాలు ఆరోగ్య రికార్డులతో సరిపోల్చారు. మెదడులో కణితులు పెరగియా? లేదా? అని పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చారు. కేవలం 0.41 శాతం మంది మహిళల్లో మాత్రమే బెయిన్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు నివేదిక రూపొందించారు. మొబైల్‌లో కనెక్షన్‌కు, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఫైనల్‌గా తేల్చారు.
మెదడు కణితుల ప్రమాదాన్ని పెంచే ఇతర కారణాలు అనేకం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. బిఎంఐ, మద్యం, ధూమపానం మొదలైన కారణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు కారణాలని పేర్కొన్నారు. సాధారణ పద్ధతుల్లో మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..
బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరిశోధకులు ఖండించారు. కొత్తగా 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక పుకార్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్‌ల నుంచి వెలువడే రేడియో తరంగాలు తలలోకి చొచ్చుకుపోయిన మెదడుకు చేరుకుంటాయని, ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ తోసిపుచ్చింది. ఈ మేరకు ఒక జర్నల్‌లో క్లారిటీ ఇస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. మొబైల్ ఫోన్‌ల వినియోగం వల్ల క్యాన్సర్ రాదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా తొలుగ ఫోన్ వినియోగం క్యాన్సర్‌కు కారణం అవుతుందని ప్రకటించింది. కానీ, పూర్తిస్థాయి నివేదికలు పరిశీలించిన ఆ తరువాత ఆ కామెంట్‌ను వెనక్కి తీసుకుంది.
Also read:
Kolkata Knight Riders vs Punjab Kings: రస్సెల్ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. కోల్‌కతా అదిరిపోయే విక్టరీ.. !
April Fool’s Day: ఏప్రిల్‌లో ‘‘ఫూల్స్ డే’’ని ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..