AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పులు చేస్తే మీ జీర్ణవ్యవస్థ ఖతమే!

వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ ఒక అద్భుతమైన పండు అనడంలో సందేహం లేదు. ఇందులో ఉండే అధిక నీటి శాతం శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అయితే పుచ్చకాయ తినే విషయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు వారి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయను ఎలా తినాలి, ఫ్రిజ్‌లో ఉంచిన పండును తినడం వల్ల కలిగే నష్టాలేంటి తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.

Watermelon: పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పులు చేస్తే మీ జీర్ణవ్యవస్థ ఖతమే!
Side Effects Of Cold Watermelon
Bhavani
|

Updated on: Apr 18, 2026 | 8:30 PM

Share

వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లో పుచ్చకాయలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రించడంలో ఎండ దెబ్బ నుండి కాపాడటంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తీసుకునే పద్ధతి సరిగ్గా లేకపోతే కడుపు నొప్పి, ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయ నుండి పూర్తి పోషకాలు అందాలంటే మనం కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం తప్పనిసరి.

రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే.. చాలామంది పుచ్చకాయను చల్లగా తినాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పుచ్చకాయలోని సహజ గుణాలు మారిపోతాయి. అతిగా చల్లబడిన పుచ్చకాయను తినడం జీర్ణక్రియకు హానికరం. మీకు చల్లటి పుచ్చకాయ తినాలనిపిస్తే, దానిని ఫ్రిజ్‌లో పెట్టడానికి బదులుగా, తినడానికి 3 నుండి 4 గంటల ముందు ఒక బకెట్ చల్లటి నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల పండు సహజంగా చల్లబడటమే కాకుండా అందులోని పోషక విలువలు కూడా అలాగే ఉంటాయి.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం అనేది అందరూ చేసే అతిపెద్ద పొరపాటు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. పుచ్చకాయలో ఇప్పటికే 90 శాతం వరకు నీరు ఉంటుంది. దానిపై మళ్ళీ అదనంగా నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా విరేచనాలు, వాంతులు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.

ఎంత పరిమాణంలో తినాలి? పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని అతిగా తినడం కూడా శ్రేయస్కరం కాదు. ఒక సాధారణ వ్యక్తి ఒక ప్లేటు లేదా 2 నుండి 3 పెద్ద ముక్కలు తినడం సరిపోతుంది. ఒక మధ్యస్థ పరిమాణపు పుచ్చకాయను కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు పంచుకుని తినడం ఉత్తమం. మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే మనకు పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా వేసవిలో పండ్లను తాజాగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించండి.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలు వైద్య నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు ఉంటే, మీ ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి