Operation: చాలామంది ఆపరేషన్ల తర్వాత బరువు విపరీతంగా పెరుగుతారు. శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఇదొక్కటే కారణం కాదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత శరీరానికి చాలా విశ్రాంతి అవసరం. దీని కారణంగా శరీర కార్యకలాపాలు బాగా తగ్గుతాయి. దీంతో బరువు బాగా పెరుగుతారు. చాలా సార్లు వైద్యులు ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి కొన్ని మందులను సూచిస్తారు. ఈ మందులు తిరిగి బలం, శక్తిని పొందడానికి పనిచేస్తాయి. ఇవి జీవక్రియ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో బరువు పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఆపరేషన్ వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా హార్మోన్లలో అసమతుల్యత పెరుగుతుంది. శరీరంపై ఒత్తిడి మొదలవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా అడ్రినల్ గ్రంధిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఇది ఎక్కువ కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కార్టిసాల్, యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్ పెరగడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు.
ఆపరేషన్ తర్వాత ఇలా బరువు తగ్గించుకోండి..
వాస్తవానికి శరీరానికి శక్తిని అందించడంలో ప్రోటీన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, మీరు గుడ్లు, చేపలు, పప్పులు మొదలైనవాటిని తినాలి. కూరగాయలు, పండ్లలో నీరు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది బరువు పెరగకుండా సహాయపడుతాయి. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. బరువుకి సంబంధించిన సమస్యలుంటే నిపుణుల సలహా తీసుకోకుండా ఏం చేయకూడదని గుర్తుంచుకోండి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.