Acupuncture: వారికి ఆక్యుపంక్చర్‌ చికిత్సతో అద్భుత ఫలితాలు.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

|

Mar 14, 2023 | 11:26 AM

సుమారు 30 రకాల మందులు తీసుకున్నప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించలేదని పేర్కొన్నారు. దీంతో జీవితంలో నిరాశ మొదలైంది. అయితే మే 2022లో ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకోవడం  ప్రారంభించినట్లు..  మూడు నెలల తర్వాత, ఉపశమనం ఇవ్వడం మొదలైందన్నారు

Acupuncture: వారికి ఆక్యుపంక్చర్‌ చికిత్సతో అద్భుత ఫలితాలు.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
long covid patients acupuncture
Follow us on

కోవిడ్ 19 సృష్టించిన విధ్వంసం గురించి ప్రపంచం ఇంకా బయట పడలేదు. ప్రాణాలకు ముప్పుతో పాటు.. కొన్ని నెలల పాటు లోకంతో సంబంధాలు తెగిపోయాయి. మనిషి జీవితం కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నంత భయానకంగా సాగింది. అయితే ఇప్పుడు దీర్ఘకాల కోవిడ్ చికిత్సకు సంబంధించి కొత్త .. ఉపశమనం కలిగించే వార్త వినిపిస్తోంది. చాలా కాలంగా కోవిడ్ రోగుల చికిత్సలో భాగంగా తీసుకునే ఇంగ్లిష్ మెడిసిన్స్ కంటే.. ఆక్యుపంక్చర్‌తో చికిత్స ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని అమెరికాకు చెందిన అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు అమెరికాలోని పలు నగరాల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడైందని తెలిపింది.

సహజంగానే ఈ అధ్యయనంలో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరమైనవి. ఎందుకంటే ఆక్సిజన్ , మంచాలు మెడిసిన్స్ కొరత సమయాల్లో.. ఆక్యుపంక్చర్, ధ్యానం లేదా పురాతన మూలికల వంటి సహజ పద్ధతుల ద్వారా చికిత్స తీసుకోవడం మంచిదని వెల్లడించింది. ప్రస్తుతం  ఆక్యుపంక్చర్‌ చికిత్స తీసుకోవడం కోసం ఆలోచించమని సూచిస్తుంది. కొత్త అధ్యయనంలోని వాస్తవాల్లో భాగంగా సహజ చికిత్స తీసుకున్నవారిలో తగ్గుతున్న వైరస్ ప్రభావం ఈ  నమ్మకాన్ని వ్యక్తం చేశాయి.

అమెరికాలో షాకింగ్ స్టడీ:
మసాచుసెట్స్ నివాసి అయిన లారెన్ నికోల్స్.. తనకు మార్చి 2020లో కోవిడ్ సోకిందని..  అప్పుడు బాగానే ఉంది కానీ చెడు ప్రభావం చూపలేదు. గత రెండేళ్లలో మైగ్రేన్, అలసట, మూర్ఛ, విరేచనాలు, ఇతర శాశ్వత లక్షణాలతో ఇబ్బంది పడ్డానని.. అప్పుడు సుమారు 30 రకాల మందులు తీసుకున్నప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించలేదని పేర్కొన్నారు. దీంతో జీవితంలో నిరాశ మొదలైంది. అయితే మే 2022లో ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకోవడం  ప్రారంభించినట్లు..  మూడు నెలల తర్వాత, ఉపశమనం ఇవ్వడం మొదలైందన్నారు. మొదట్లో రోజుకు నాలుగైదు సార్లు మైగ్రేన్ వచ్చేదని.. ఆ తర్వాత రెండుసార్లు వచ్చి చివరకు రోజుకు ఒకసారి మైగ్రేన్ వచ్చేదని లారెన్ నికోల్స్ చెప్పారు.  అలా క్రమేపీ కరోనా తర్వాత ఎదురైన ఇబ్బందులు తగ్గాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీర్ఘకాల కోవిడ్‌కు చికిత్స లేదు
ఫిబ్రవరి నాటికి.. పాపులేషన్ బ్యూరో నిర్వహించిన గృహ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం, దాదాపు 11 శాతం మంది అమెరికన్ వృద్ధులు దీర్ఘకాలంగా కోవిడ్‌ను ఎదుర్కొంటున్నారు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత కనీసం మూడు నెలల పాటు ఉండే లక్షణాలను లాంగ్ కోవిడ్ అంటారు.  ఈ సుదీర్ఘ కోవిడ్‌కు ప్రామాణిక చికిత్స లేదు. ఒక వ్యక్తి  లక్షణాల ఆధారంగా వైద్యులు తరచుగా మందులను సూచిస్తారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్‌ చికిత్స  ఒక ట్రయల్ ప్రక్రియ కాబట్టి.. కనుక రోగులందరికీ వెంటనే ఉపశమనం కలిగించదని వైద్యులు చెబుతున్నారు.

బ్రిటన్‌లో కూడా ఆక్యుపంక్చర్ పై అధ్యయనం
UK  లో కూడా దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న రోగులకు ఆరు వారాల పాటు ప్రతి వారం 15 నిమిషాల ఆక్యుపంక్చర్ చికిత్సలు అందిస్తున్నారు. మూడు వారాల పాటు ఆక్యుపంక్చర్ తీసుకున్న తర్వాత.. శక్తివంతులుగా మారుతున్నారని.. పరుగు పెట్టేటంత శక్తి వస్తుందని పేర్కొన్నారు. ఆక్యుపంక్చర్‌ చికిత్స తీసుకున్న తర్వాత కండరాల అలసట దాదాపు తగ్గిపోయిందని ఓ బాధితురాలు చెప్పింది.

అయితే ఆక్యుపంక్చర్ చికిత్స ప్రభావాలను అధ్యయనం చేయడం సవాలుతో కూడుకున్నదని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ, ఆక్యుపంక్చర్ దీర్ఘకాలిక నొప్పి, అలసట లేదా వాపును తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి.

అయితే ఈ చికిత్సా విధానంపై యేల్ యూనివర్శిటీలో కార్డియాలజిస్ట్, శాస్త్రవేత్త డాక్టర్ హర్లాన్ క్రుమ్హోల్జ్ హెచ్చరించారు.  అంతేకాదు “పూర్తిగా పరీక్షించబడని వ్యూహాలను బాధితులకు అందించడంపై చాలా మంది ప్రజలు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనవి..  ఖరీదైనవి కావచ్చని చెప్పారు డాక్టర్ హర్లాన్ క్రుమ్హోల్జ్.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి