పప్పు ధాన్యాలు ప్రపంచంలో ఎక్కువగా ప్రజలు తీసుకునే ఆహారంలో ముఖ్యమైనవి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్, జింక్, ఫోలెట్, మెగ్నీషియం వంటి విటమిన్లతో పాటు శరీరానికి అవసరమయ్యే మినరల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మినపప్పులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఓ పప్పు ధాన్యం గురించి తెలుసుకుందాం. అవే ఉలవలు. ఉలవలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. అలాగే పశువుల దాణాకు కూడా ఉలవలను వాడతారు. అయితే మారుతున్న ఆహార అలవాట్ల వల్ల ఉలవల వాడకం తగ్గిపోతుంది. కానీ ఉలవల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉలవల్లో ఉండే పోషకాల వల్ల పైల్స్, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి ఎన్నో రకాల సమస్యలను అధిగమించవచ్చు. ఉలవలు రెగ్యులర్ గా తినే వారు ఇతరులతో పోల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. విటమిన్-బి, ఐరన్, కాల్షియం వంటివి ఉలవల్లో పుష్కలంగా ఉంటాయి. ఉలవలు తినడం వల్ల కలిగే మేలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఉలవలు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ల వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఉలవలు డైలీ తింటే బరువు పెరగకుండా స్థిరమైన బరువుతో జీవించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అంతా మసాలా ఆహారం కారణంగా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు డైలీ ఆహారంలో ఉలవలను యాడ్ చేసుకుంటే పైల్స్ సమస్య దూరం అవుతుంది. ఉలవలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే పైల్స్ సమస్యయ తీరుతుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా తర్వాత చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఉలవలను డైలీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర పప్పులతో పోలిస్తే ఉలవల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో బాస్వరం, అమైనా ఆమ్లాలు ఉండడం వల్ల ఎముకలను ధృడంగా చేయడంలో సాయం చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఉలవలు ప్రభావవంతంగా పని చేస్తాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఉలవలను తీసుకుంటే మంచిదని నిపుణుల సూచన. దీంతో గుండె సమస్యలు, ఉబ్బసం, మూత్ర సమస్యలు, కామెర్లు, అల్సర్లు, బ్రొన్కైటిస్, రుతుక్రమం వంటి సమస్యలు ఉలవలు ఆహారంగా తీసుకుంటే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
స్త్రీలు రుతుక్రమ సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఉలవలను ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరిగి రుతుక్రమ సమయంలో నొప్పిని ఎదుర్కోరు. అలాగే ఉలవలు డైలీ ఆహారంలో తీసుకుంటే శరీరంలో రక్తం లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి