చలికాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతల వలన తక్కువగా నీరు తాగడం.. వాటర్ ఫ్రూట్స్ తక్కువగా తీసుకోవడం చేస్తుంటారు. దీంతో చర్మం పొడిబారడం.. దురద వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే కేవలం చలికాలం మాత్రమే కాకుండా.. మిగతా సీజన్స్లోనూ కొందరికి చర్మం తరచూ పొడిబారుతుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా తమ చర్మానికి క్రీమ్స్, లోషన్స్ వాడుతుంటారు. కానీ చర్మం పొడి బారడం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ప్రతిసారి చర్మం పొడిబారుతుంది అనేది తెలుసుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఇలా తరచూ చర్మం పొడిబారడం వలన అనేక రకాల వ్యాధులు ఉన్నట్టు అని నిపుణులు అంటున్నారు. అవెంటో తెలుసుకుందామా
చర్మం తరచూ పొడి బారుతుంటే.. వారికి కిడ్ని సమస్య ఉన్నట్లు. కిడ్నీలు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇవి ప్రధానంగా రక్తాన్ని ఫిల్టర్ చేయడం.. కాల్షియం, పొటాషియం వంటి పోషకాల సమతుల్యతను నియంత్రించడం వంటి పనులు చేస్తుటాయి. దీంతోపాటు.. శరీరంలో ఇతర ముఖ్యమైన భాగాలు పనిచేయడం.. హార్మోన్లను శరీరంలోకి విడుదల చేయడం చేస్తుంటాయి. దీంతో చర్మం సహజంగా హైడ్రేటెడ్.. ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో ఖనిజాలు, పోషకాల పరిమాణంలో అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది.
కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. చర్మం విపరీతంగా దురదతోపాటు.. తేమను కోల్పోతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకార.. చర్మ సంబంధిత లక్షణాలు కిడ్నీ వ్యాధికి సంకేతంగా ఉంటాయట. చర్మం పొడి పొడిగా పొలుసులుగా ఉండడం. చర్మం బిగుతుగా.. పగుళ్లు ఏర్పడుతుంది. ఫిష్ స్కేల్ స్కిన్ ఏర్పడుతుంది. ఈ లక్షణాలన్నింటినీ శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కిడ్నీ సమస్య వచ్చినప్పుడు దాని ప్రభావాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. చర్మం పొడిగా మారడం.. దురదవంటి సమస్యలు శరీరంలో వీపు భాగంలో చేతులు వంటి వాటిలో కనిపిస్తాయి. పెద్ద వారిలో కిడ్నీ వ్యాధి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉది. అందువలన చర్మం తరచూ పొడిబారితే.. దురదగా అనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. దీంతో కిడ్నీ వ్యాధులను ముందుగానే తెలుసుకోవచ్చు.
గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అధ్యాయనాలు, ఇతర నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..
Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..