Water Side Effects: అలర్ట్.. చల్లటి నీరు అధికంగా తాగుతున్నారా? అయితే దీనిపై ఓ లుక్కెయ్యండి….

|

Feb 11, 2022 | 4:05 PM

నీరు (Water).. ప్రాణకోటికి ఆధారం. జీవించడానికి నీరు ప్రథమంగా ముఖ్యం. మానవాళి మనుగడకు గాలి తర్వాత నీరు అత్యంత ముఖ్యమైనది.

Water Side Effects: అలర్ట్.. చల్లటి నీరు అధికంగా తాగుతున్నారా? అయితే దీనిపై ఓ లుక్కెయ్యండి....
Water
Follow us on

నీరు (Water).. ప్రాణకోటికి ఆధారం. జీవించడానికి నీరు ప్రథమంగా ముఖ్యం. మానవాళి మనుగడకు గాలి తర్వాత నీరు అత్యంత ముఖ్యమైనది. రోజులో నీరు దాదాపు 2 లీటర్ల మేర తాగితే ఆరోగ్యంగా ఉంటారని.. డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. చర్మం.. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలని సూచిన్నారు వైద్య నిపుణులు. అయితే చాలా మంది చలికాలంలో ఎక్కువగా నీరు తీసుకోరు. అలాంటి వారు.. ఎక్కువగా పండ్లను తీసుకోవడం మంచిది. మరోవైపు వేసవి కాలం రాబోతుంది. ఎండకాలంలో నీటిని ఎక్కువగా తీసుకుంటారు. చల్లటి నీటిని తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు.. కానీ చల్లని నీరు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుసుకున్నారా. అవునండి.. వేసవిలో ఎక్కువగా చల్లటి నీటిని తాగడం వలన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. అవెంటో తెలుసుకుందామా..

ఎక్కువగా చల్లటి నీటిని.. లేదా కూల్ డ్రింక్స్ తాగడం వలన వలన రక్తనాళాలు తగ్గిపోతాయి. ఇది జీర్ణక్రియను నిరోధిస్తుంది. ఇది జీర్ణక్రియ సమయంలో పోషకాలను గ్రహించే సహజ ప్రక్రియను కూడా నిరోధిస్తుంది. చల్లటినీటిని తాగడం వలన గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం తర్వాత చల్లటి నీటిని తాగడం వలన కొవ్వు ఎక్కువగా పట్టేస్తుంది. శరీరానికి అనవసరమైన కొవ్వును విచ్ఛిన్నం చేయడం కష్టతరం చేస్తుంది. అలాగే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. భోజనానికి ముంది నీరుకు మధ్య 30 నిమిషాల సమయం ఉండాలి.

చల్లని నీరు తాగడం వలన గుండె వేగం రేటు తగ్గుతుందని అధ్యాయనాల్లో తెలీంది. ఐస్ వాటర్ తాగడం వలన శరీరంలోని అటానమిక్ నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగమైన వాగస్ నాడిని ప్రేరేపిస్తుంది. ఇది గుండె వేగం రేటును తగ్గిస్తుంది. వ్యాయమం తర్వాత ఐస్ వాటర్ తాగడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన శరీరానికి గొరువెచ్చని నీరు తాగడం మంచిది. వ్యాయాంమం చేయడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. ఐస్ వాటర్ తాగడం వలన కడుపులో చికాకు పెరుగుతుంది.

గమనిక:- ఈ కథనంలోని సమాచారం కేవలం నిపుణుల సూచనల ఆధారంగా.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. వివరాలు తెలుసుకోవడానికి ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..