Ghee: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

|

Apr 26, 2022 | 7:38 PM

భారతీయ వంటకాలలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేద సంప్రదాయ

Ghee: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..
Ghee
Follow us on

భారతీయ వంటకాలలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేద సంప్రదాయ చికిత్సలో శతాబ్ధాలుగా మూలికా ఔషధాలతోపాటు నెయ్యిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. నెయ్యిలో అనేక పోషకాలు, విటమిన్స్ ఏ,సీ, డీ ఖనిజాలు ఉంటాయి. శరీర బరువును పెంచడమే కాకుండా.. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే నెయ్యి వలన కలిగే ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రేఖా రాధామోని ప్రకారం, నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అయితే నెయ్యి తీసుకోవడం వల్ల కొంతమందికి ఆరోగ్యానికి మంచిది కాదు.. ఎలాంటి వ్యక్తులు నెయ్యిని తినకూడదో తెలుసుకుందామా.

నెయ్యి తినకూడని వ్యక్తులు..
నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు నెయ్యిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అలాగే కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యి తీసుకోవద్దు. తింటే మరిన్ని సమస్యలు వస్తాయి.

జలుబు.. దగ్గు జ్వరంతో భాదపడే వ్యక్తులు..
నెయ్యి తీసుకోవడం వలన శరీరంలో కఫం పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు నెయ్యి తినకూడదు. ఇలా చేయడం వలన సమస్య పెరుగుతుంది.

గర్భధారణ కడుపు సమస్యలు..
గర్భధారణ సమయంలో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది. కానీ.. గర్భిణీలు కడుపు నొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే నెయ్యి తినకూడదు.

కాలేయ వ్యాధులు..
కాలేయ సంబంధిత సమస్యలు లేదా ప్లీహానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే నెయ్యిని తీసుకోవద్దు. అలాంటివారు నెయ్యి తీసుకోవడం వలన సమస్యలు వస్తాయి.

నెయ్యి వలన కలిగే ప్రయోజనాలు..
నెయ్యిలో ఉండే విటమిన్ ఇ శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్, ఆర్థరైటిస్, క్యాటరాక్ట్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నెయ్యిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యి తినడం వల్ల మీ మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు..అభిప్రాయాల ప్రకారం ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..