టాన్సిల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే వీటితో ఉపశమనం పొందండి..

|

Oct 26, 2021 | 10:47 AM

టాన్సిల్స్ చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తుంటాయి. నాలుక లోపల గొంతు గోడలకు రెండు వైపుల

టాన్సిల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే వీటితో ఉపశమనం పొందండి..
Tonsillitis
Follow us on

టాన్సిల్స్ చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని వేధిస్తుంటాయి. నాలుక లోపల గొంతు గోడలకు రెండు వైపుల గుండ్రని గడ్డలను టాన్సిల్స్ అంటారు. ఇవి ముఖ్యంగా గొంతు నొప్పి, అన్నం తినడం.. ఏదైనా మింగాలి అంటే తెగ ఇబ్బంది పెడుతుంది. ఇవి ఎక్కువగా జలుబు చేసినప్పుడు వస్తుంటాయి.. అలాగే కొందరిలో తలనొప్పి, నిద్ర లేకపోవడం.. నోటి దుర్వాసనను కలిగిస్తాయి. ఈ టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలతో ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

* గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి తరచు గార్గ్ చేయాలి.. ఇలా చేయడం వలన ఉపశమనం లభిస్తుంది..
* పసుపు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి రాత్రి పడుకునే ముంది తాగితే టాన్సిల్స్ సమస్య తగ్గుతుంది.
* కొన్ని చిటికెడు వేప పొడిని నీటిలో మరిగించాలి.. అందులో కాస్త ఉప్పు వేసి చల్లారిన తర్వాత తాగాలి… రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
* తులసిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు ఉన్నాయి. ఇది టాన్సిల్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు.
* అకాసియా చెట్టు.. మనం తుమ్మ చెట్టు అంటుంటాం. ఈ తుమ్మ చెట్టు బెరడును నీటిలో వేసి మరగించి ఆ నీటితో పుక్కలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి. రోజూకు కనీసం 3 -4 సార్లు చేయాలి.
* బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడం..టాన్సిల్స్ నయం చేయడంలో దాల్చిన చెక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ దాల్చిన చెక్క పొడి.. ఒక టీస్పూన్ తేనె ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని రోజుకు కొన్నిసార్లు తాగితే టాన్సిల్స్ తగ్గుతాయి.
* మెంతులను వేడి నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలించాలి. ఎంత ఎక్కువ గార్గిల్ చేస్తే అంత త్వరగా టాన్సిల్స్ తగ్గుతాయి.

Also Read: Bigg Boss 5 Telugu: అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాడనుకున్నా.. షాకింగ్ విషయాలను చెప్పిన ప్రియాంక పేరెంట్స్..

Sekhar Kammula: పెద్ద మనస్సు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు సాయం.. అసలు ఏం జరిగిందంటే..