Winter Health Tips: ఈ పదార్థాలను వండడం వలన ఆరోగ్యానికి ప్రమాదమే.. అవెంటో తెలుసా..

|

Dec 01, 2021 | 3:55 PM

సాధారణంగా కూరగాయాలు కొన్ని వంట చేసుకుని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. మరికొన్ని పదార్థాలను

Winter Health Tips: ఈ పదార్థాలను వండడం వలన ఆరోగ్యానికి ప్రమాదమే.. అవెంటో తెలుసా..
Follow us on

సాధారణంగా కూరగాయాలు కొన్ని వంట చేసుకుని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. మరికొన్ని పదార్థాలను అలాగే పచ్చిగా తినడం వలన అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. పచ్చి కూరగాయలు తినడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో.. మరికొన్ని పదార్థాలను వంట చేసి తినడం వలన ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలుసా. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. డ్రైఫ్రూట్స్ పచ్చివి తినడం లేదా.. రాత్రంతాన నానబెట్టినవి తీసుకోవడం ఉత్తమం. కానీ వీటిని ఉడికించి తినడం వలన ఆరోగ్యానికి హానీకరంగా మారతాయి. డ్రైఫ్రూట్స్ ఉడకపెట్టి తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. దీంతో ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాకుండా కేలరీలు, కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఈ డ్రైఫ్రూట్స్ ఉడికించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

కొబ్బరి ఆరోగ్యానికి మంచిది. దీనిని పొడిగా ఉన్నప్పుడు.. లేదా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ ఉడికించి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఈ కొబ్బరిని ఉడికించి తీసుకోవడం వలన అందులో ఉండే మెగ్నీషియం, సోడియం, పోటాషియం వంటి అనేక ఇతర పోషకాలు నాశనం అవుతాయి. దీంతో ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి.

బ్రకోలీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రోగ నిరోదక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక పోషకాలను అందిస్తుంది. అయితే ఈ బ్రకోలీని ఉడికించి తీసుకోవడం వలన పోషకాలు తగ్గిపోతాయి. దీనిని ఉడికించడం వలన అందులో ఉండే విటమిన్ ఎ, సీ, పొటాషియం, ప్రోటీన్స్ వంటి పోషకాలు నశించిపోతాయి. ఫలితంగా ఆరోగ్యానికి ప్రయోజనం ఉండదు.

క్యాప్సికమ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి, వంటి ఇతర అనేక పోషకాలున్నాయి. ఈ క్యాప్సికమ్ తీసుకోవడం వలన అనే ప్రయోజనాలు ఉంటాయి. కానీ దీనిని ఉడికించి తీసుకోవడం వలన అనేక పోషకాలు నశిస్తాయి.

Also Read: Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..

Kamal Haasan: కరోనాను జయించిన కమల్ హాసన్.. ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్..