మనకు జామపండ్లు (Guava) సులభంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. డయాబెటిక్ రోగులకు దివ్యఔషదం. వెబ్ మేడ్ నివేదిక ప్రకారం ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అతిసారం, పీరియడ్స్ క్రాంప్స్, చిగుళ్ల వ్యాధి, అధిక రక్తపోటు, మోకాళ్ల నొప్పులు, గుండె జబ్బులు, ఊబకాయం, చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఇ అధికంగా ఉంటాయి. ఇవి కళ్లకు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. జామపండులో లైకోపీన్ అనే పైటోన్యూట్రియెంట్స్ శరీరాన్ని క్యాన్సర్, ట్యూమర్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ జామపండును అతిగా తింటే అనేక రకాల దుష్ప్రభావాలు కల్గుతాయి. జామపండును ఎక్కువగా తినడం వలన కలిగే నష్టాలెంటో తెలుసుకుందామా.
జామపండును ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణశక్తి బలహీనంగా ఉండేవారు జామపండును తినకూడదు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో అతిగా తింటే కడుపు నొప్పి వస్తుంది.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు జామపండును తీసుకోవడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఎవరికైనా జలుబు లేదా దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే జామపండును తక్కువగా తినాలి. ఎందుకంటే జామ ప్రభావం చల్లగా ఉంటుంది.. ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే జామ పండు రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారు జామపండును జాగ్రత్తగా తీసుకోవాలి.. అలాగని ఎక్కువగా కూడా తినకూడదు. ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్ సలహ తీసుకున్న తర్వాతే జామపండును తినాలి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీనివలన రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. జామ ఆకులను తీసుకోవడం వలన రక్తహీనత, తలనొప్పి, కిడ్నీ సమస్యలు వస్తాయి. జామపండును అతిగా తీసుకోకుడదు.
గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. వైద్యుల సూచనలు…అధ్యాయనాల నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Also Read: Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే భీమ్లా నాయక్ ప్రీ రిలిజ్ ఈవెంట్..
Pushpa Song: పుష్ప హ్యాంగోవర్ ఇప్పట్లో వదిలేలా లేదుగా.. వైరల్ అవుతోన్న రాఖీ సవంత్ డ్యాన్స్..
Bandla Ganesh: ఆ ఆడియోలో ఉంది నా వాయిస్ కాదు.. కొట్టి పారేసిన బండ్ల గణేష్..
RGV: భీమ్లా నాయక్‌పై సెటైర్లు.. పవన్ ఫ్యాన్స్‌ను మరోసారి కవ్వించిన రామ్‌గోపాల్ వర్మ..