సాధారణంగా వేసవిలో తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన ఆహారపదార్థాలను తీసుకోవాలి. అందులో పనసపండు ఒకటి. ఈ పండను ఎంతో ఇష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. దీనిలో అనేక పోషకాలున్నాయి. వేసవిలో పనసపండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి . కేవలం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ పనసపండు కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పండు తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.
మధుమేహం నియంత్రణ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పనసపండు దివ్యౌషదం. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ విడుదలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల చక్కెర స్థాయి అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. వాతావరణం మారుతున్న కొద్దీ అనేక సీజనల్ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడంలో ఈ పండు ఉపయోగపడుతుంది. డైటరీ ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ , ఫాస్పరస్ వంటి పోషకాలు, ఇందులో ఉండే విటమిన్లు-ఎ, సి, బి, వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బరువు తగ్గడం.. తక్కువ కేలరీలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉండే పనసపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. పసనపండు తినడం వల్ల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఎముకలు దృఢంగా ఉంటాయి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పనసపండు కాల్షియం మూలం. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఇది కాకుండా విటమిన్-సి, మెగ్నీషియం కూడా ఇందులో ఉన్నాయి, ఇది ఎముకలను బలంగా చేయడానికి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.
నిద్రలో మేలు చేస్తుంది.. నిద్రలేమి వంటి నిద్ర రుగ్మతలలో కూడా పనసపండు మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్ల స్థాయిని నియంత్రిస్తుంది. దీని వల్ల నరాలకు విశ్రాంతి లభిస్తుంది దీంతో సరైన నిద్ర ఉంటుంది. ఆహారంలో క్రమం తప్పకుండా ఈ పనసపండును చేర్చడం ద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‌తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..
Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..