Curry Leaves: కరివేపాకుతో ఈ వ్యాధులు దూరం.. ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి..

సాధారణంగా వంటలో రుచిని పెంచేందుకు కరివేపాకును ఉపయోగిస్తుంటాం. కానీ మీకు ఓ విషయం తెలుసా.. కరివేపాకుతో

Curry Leaves: కరివేపాకుతో ఈ వ్యాధులు దూరం.. ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి..
Curry Leaves

Updated on: Jan 12, 2022 | 8:35 AM

సాధారణంగా వంటలో రుచిని పెంచేందుకు కరివేపాకును ఉపయోగిస్తుంటాం. కానీ మీకు ఓ విషయం తెలుసా.. కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి. వంటల్లో కరివేపాకును ఉపయోగించడమే కాకుండా.. జుట్టు, చర్మ సమస్యలకు కూడా వీటిని వాడేస్తుంటారు. అంతేకాదు.. కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఒబేసిటీ కూడా తగ్గుతుంది. జుట్టు రాలిపోతోందా లేదా జుట్టు సమస్యలు ఉన్నవారు కరివేపాకును ఉపయోగించాలి. అంతేకాకుండా.. కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. అలాగే కాలేయానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి సహయపడుతంది. ఎనీమియా సమస్య ఉండదు. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.

అలాగే కరివేపాకు ఉపయోగించడం వలన జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. తెల్ల చుట్టు సమస్యను తగ్గిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వారికి చక్కటి రిలీఫ్ ఇస్తుంది. అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. నీళ్లలో మరిగించి కరివేపాకును రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. అలాగే కరివేపాకు పొడిని తీసుకోవడం వలన నోటి అల్సర్ సమస్య తగ్గుతుంది. ఇవే కాకుండా.. షుగర్ ను తగ్గించడానికి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మీరు ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఆకులను తీసుకొని తినొచ్చు అయితే ఈ సమస్యలు తొలగించాలంటే 8 నుండి కరివేపాకు ఆకుల్ని ఉదయాన్నే తినాలి.

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..